బన్నీ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సహా గత కొంతకాలంగా ఆశించిన విజయాలు దక్కక సతమతమవుతున్నాడు. డిఫ్రెంట్ కాన్సెప్ట్స్ తో హిట్ కోసం ట్రై చేసినప్పటికి అవి ప్రేక్షకులకు ఏ మాత్రం ఆకట్టుకోలేపోయాయి . దీంతో ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ ని కొట్టాలన్న ఇద్దేశ్యంతో బన్నీ మాటల మాంత్రీకుడి తో రెడీ అవుతున్నాడు. 'అల వైకుంఠపురములో' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించుకున్నాయి. ఇప్పుడు మరోసారి బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ చాలా రోజుకులకి మళ్ళీ రిపీట్ అవుతుండడంతో ఈసారి భారీ హిట్ గ్యారెంటీ అని బన్నీ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. 

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మొదటి సినిమాతోనే సక్సస్ ను సొంతం చేసుకున్నాడు. తర్వాత ఆర్య, బన్ని, దేశముదురు, ఆర్య-2, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు..వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కమర్షియల్ సక్సస్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అల్లు అర్జున్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతీ సినిమాకోసం ఒక డిఫ్రెంట్ మేకోవర్ తో ప్రేక్షకులకు కొత్తగా కనిపించి స్టైలిష్ స్టార్ గా అభిమానులను అలరిస్తున్నాడు. ఇక బన్నీ డాన్స్ విషయంలో చేసే హార్డ్ వర్క్ మామూలుగా ఉండదు. అందుకే బన్నీ డాన్స్ కి ఫ్యాన్స్ ప్రత్యేకంగా థియోటర్స్ కి వస్తుంటారనడంలో అతిశయోక్తి లేదు.  

ఇక బన్నీ మరోసారి త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ ఇద్దరు ఈసారి మ్యాజిక్ చేయబోతున్నారని ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్సైపోయారు. మన మాంత్రీకుడు తన పెన్ను పవర్ ని వాడి మాటలతో మాయ చేయడం... పంచు డైలాగ్ లతో మెస్మరైజ్ చేయడం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ పంచ్ డైలాగ్స్.. బన్నీ మార్క్ టైమింగ్ తోడైతే నిజాంగా మ్యాజిక్ జరగతుంది. ఇక త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కి  కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన సామజవరగమన, రాములో..రాముల  పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమా రేంజ్ ని ఇంకా పెంచేశాయి. ఇక బన్నీ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్.ఎస్. తమన్ సంగీతమందితున్న సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: