టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీగా నిర్మితం అవుతున్న తాజా సినిమా అలవైకుంఠుప్రములో. గోల్డెన్ లెగ్ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు సామజవరగమనా, రాములో రాములా లిరికల్ సాంగ్స్, శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ సంపాదించిన విషయం తెలిసిందే. ఇక మరీ ముఖ్యంగా సామజవరగమనా సాంగ్ కు యూత్ ఆడియన్స్ మరింతగా కనెక్ట్ అవుతున్నారు. 

ఇకపోతే ఈ సినిమా నుండి డాడీ డాడీ అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ ని వచ్చే వారం యూట్యూబ్ లో రిలీజ్ చేయనుందట సినిమా యూనిట్. తండ్రి, కొడుకుల అనుబంధాన్ని తెలిపేలా ఆకట్టుకునే సంగీతం, సాహిత్యంతో ఈ పాట సాగుతుందని టాక్ వినపడుతోంది. అలానే ఈ సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. సీనియర్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ సామజవరగమనా సాంగ్ షూటింగ్ కోసం ఫ్రాన్స్ దేశం వెళ్ళింది. అక్కడి అద్భుతమైన లొకేషన్స్ లో ఆ సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్లు నిన్న సినిమా యూనిట్ కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేసింది. సంక్రాంతి కానుకగా 2020, జనవరి 12న ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: