మెగాస్టార్ చిరంజీవి సైరాలో ముఖ్యపాత్ర పోషించిన విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఆయన హీరోగా నటించిన సినిమా ‘సంగ తమిళ్’ ‘ సినిమా తెలుగులో డబ్బింగ్ సినిమాగా రాబోతోంది. తెలుగులో ఈ సినిమాకు ‘విజయ్ సేతుపతి’ అనే టైటిల్ పెట్టి ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. తమిళ్ లో విజయ్ సేతుపతికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. నాన్ రౌడీ దాన్, విక్రమ్ వేద.. సినిమాలు విజయ్ కు తమిళ్ లో మంచి మార్కెట్ ను ఏర్పరచాయి.

 


హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ముఖ్య అతిథులుగా దర్శకుడు సముద్ర తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు విజయ్ చందర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ. ఏఎం రత్నం గారికి ఈ కథను చెప్పేందుకు ప్రయత్నించినా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో కుదరలేదు. తర్వాత ఈ కథను విజయ్ సేతుపతికి వినిపించాను. కథ నచ్చి ఆయన ఈ సినిమా చేశారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాను’ అన్నారు. దర్శకుడు సముద్ర మాట్లాడుతూ ‘ఏ దర్శకుడికైనా పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని కోరిక ఉంటుంది. ఈ సినిమా తర్వాత ఆయనకు ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను’ అన్నారు.

 


తెలుగులో ఈ సినిమాను హర్షిత మూవీస్ బ్యానర్ పై రావూరి వి. శ్రీనివాస్ విడుదల చేస్తున్నారు. అచ్చమైన తెలుగు సినిమాలా విజయ్ సేతుపతి ఉంటుందని తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. విజయ్ సేతుపతిలో.. రాశిఖన్నా, నివేద పేతురాజ్, నాజర్, అశుతోష్ రాణా, రవి కిషణ్ శుక్లా, తులసి.. తదితరులు నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: