వెంకీ అంటేనే ఓ కొత్తదనం ఓ డిఫరెంట్ స్టైల్ ని ఫాలోఅవుతాడు. ఇండ‌స్ట్రీలో కొత్తదనం చూపించాలంటే వెంకీ తర్వాతే ఎవరైన అని చెప్పవచ్చు. కొత్త పాత్రలను ఎంచుకోవడంలోనైన, అప్పట్లో కొత్త హీరోయిన్లతో నటించడమైన కొత్త చిత్రాలను తీసుకోవడం ఇలా  ఎప్పటికప్పుడు ఆయన కాంట్రవర్సీ లేకుండా అప్ డేట్ అయ్యే హీరో అనే చెప్పాలి. ఇటీవలె ధనుష్ నటించిన చిత్రం అసురన్ తమిళ్ లో విడుదలై అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక మరి  ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేసే రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. ఇందులో హీరోగా వెంకటేష్ నటించనున్నారు.


 గతంలో ఆయన కొన్ని రీమేక్ చిత్రాల్లో నటించినా ఒకటి, రెండు చిత్రాలు హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రంలో ధనుష్ రెండు పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఒకటి యూాత్ క్యారెక్టర్లో కనిపిస్తే మరొకటి మధ్య వయస్కుడిగా కనపడాలి మరి ఈపాత్రల కోసం వెంకీ తనను తాను మార్చుకోవడానికి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఓ పేద రైతు పాత్రలో వెంకీ కనిపించనున్నారు. ఇక మరి  ఎప్పటికప్పుడు ప్రజంట్ స్టైల్ ని ఫాలో అయ్యే  ఈ హీరో  ఇలాంటి మాస్ పాత్రలో  ఎలా ఉండబోతున్నాడా అని అందరూ ఆశక్తిగా  ఎదురుచూస్తున్నారు. మరికొందరైతే యంగ్ లుక్ కి వెంకీ సెట్ అవుతాడా అన్న ప్రశ్నలు కూడా  మరో పక్క వినిపిస్తున్నాయి. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఆయ‌న సాహ‌సం స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుందాం. అయితే ముందు ఈ చిత్రం రైట్స్‌ను రామ్‌చ‌ర‌ణ్ కొందామ‌ని చూశారు. ఈ చిత్రం ఆయ‌న‌కు కూడా చాలా బాగా న‌చ్చింది. అయితే ఆయ‌న ఆ ఆలోచ‌న‌ల్లో ఉండేట‌ప్ప‌టికే వెంక‌టేష్ కొనేశారు.  ఈ చిత్రానికి ఇప్పుడు దర్శకుడు ఫిక్స్ అయినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘లై’, ‘పడిపడి లేచే మనసు’ చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి.. ‘అసురన్’ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: