టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నం అయ్యారు. అయితే దానికి ప్రధాన కారణం, ఇటీవల ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా విఫలం అవడంతో పాటు తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా ఓటమి పాలవడంతో, ఇకపై పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు పవన్. అలానే గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటించిన అజ్ఞాతవాసి సినిమా ఘోర పరాజయం పాలవడంతో ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు. అంతేకాక తమకోసం పవన్ ఒక మంచి సినిమా చేస్తే బాగుటుందని కొద్దిరోజులుగా వారు అభిప్రాయపడుతున్నారు. 

అయితే ఎట్టకేలకు అభిమానుల కోరికను మన్నించి మళ్ళి సినిమాలోకి రావడానికి సిద్ధం అయిన పవన్, తన తదుపరి సినిమాని మాత్రం ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ఇకపోతే ఒక వారం రోజుల క్రితం పవన్ తదుపరి నటించబోయే 26వ సినిమా అప్ డేట్ కూడా రావడం జరిగింది. బాలీవుడ్ లో అమితాబ్, తాప్సి ప్రధాన పాత్రల్లో తెరకెక్కి ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన పింక్ సినిమా అధికారిక రీమేక్ లో పవన కళ్యాణ్ నటించనున్నట్లు ప్రకటన వచ్చింది. 

అయితే ఇప్పటివరకు ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, అసలు అందులో ఇతర పాత్రల్లో ఎవరెవరు నటిస్తారు అనే దానిపై మాత్రం ఇంకా ఎటువంటి సమాచారం లేకపోవడంతో, అసలు ఈ సినిమా ఉంటుందా, లేదా అని ఆయన ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందుతున్నారు. కాగా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఒక యంగ్ హీరోయిన్ ఇందులో నటించనుందని టాక్. ఇక ఈ సినిమా అధికారిక పూజ కార్యక్రమాలు కూడా త్వరలో జరుగనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: