హాలీవుడ్ మూవీస్ అనగానే అందరికి సెకనులో గుర్తొచ్చే సినిమాలు యాక్షన్ సినిమాలే అనుకుంటారు. అవెంజర్స్.. స్పైడర్ మ్యాన్, 300.. ఇలా యాక్షన్ సినిమాలకే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కాని మొదటి సారి ఒక కామెడీ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. 1 బిలియన్ డాలర్లకు సమీపంలోకి హాలీవుడ్ మూవీ 'జోకర్' వచ్చింది. గత అయిదు వారాలుగా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంకా కూడా పలు దేశాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్ము లేపుతోంది. 

సినిమా గురించి అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన ఫోర్బ్స్ ఒక కథనం లో పేర్కొనడం జరిగింది. ఫోర్బ్స్ కథనం ప్రకారం ఇండియాలో జోకర్ సినిమా 50 కోట్లకు పైగా వసూళ్ల ను రాబట్టింది. ఇండియాలో కాస్త తక్కువే అయినా ప్రపంచ దేశాల్లో మాత్రం ఈ సినిమా వసూళ్లు భారీగా ఉన్నాయి. అయిదు వారాల్లో ఈ సినిమా 953 మిలియన్ డాలర్లను అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 6816 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. 

ఫోర్బ్స్  కథనం ప్రకారం 62.5 మిలియన్ డాలర్లు అంటే 446.1 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కించారట. పెట్టుబడికి ఏకంగా 15 రెట్ల లాభం ఇప్పటి కే వచ్చింది. ఇంకా కూడా ఈ సినిమా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. బిలియన్ డాలర్ల రికార్డు కు కేవలం 47 మిలియన్ ల దూరంలో ఈ సినిమా ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే సినిమా ఏకంగా 100 మిలియన్ ల వరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా లో కథనాలు వస్తున్నాయి. హాలీవుడ్ కు చెందిన ఒక కామెడీ సినిమా ఈ స్థాయి లో వసూళ్లను రాబట్టడం ఇదే మొదటిసారి. ఇక ఇదే సినిమాతో రిలీజైన మెగాస్టార్ 'సైరా', బాలీవుడ్ 'వార్' సినిమాలను జనాలు ఎప్పుడో మర్చిపోయారు. అంతేకాదు అంత దమ్ము మన తెలుగు సినిమాలకు.. అందులోను ఒక కామెడి సినిమాకు ఉందా..! అని కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కారణం ఈ మధ్య వస్తున్న స్టార్ హీరోల సినిమాలు వరుసగా ఫ్లాపవుతుంటే అడల్ట్ కంటెంట్ తో వస్తున్న అడ్డమైన సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమ, కళామతల్లి పరువు తీస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: