గ్రేట్ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వినపడుతున్నాయి.. ఎన్నో సినిమాలకు గొంతు నందించిన ఈమె ఎన్నో సినిమాలకు అవార్డులను కూడా అందుకుంది..కాగా ఈరోజు మధ్యాహ్నము 1.30నీ నుండి ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని  గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు.


ప్రస్తుతం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కొన్ని రోజులుగా ఆమెకు శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం. లత ఆరోగ్యంపై మరికొద్దిసేపట్లో బంధువులు అధికారిక ప్రకటన చేయనున్నారు.


ఇకపోతే లతా గారు దాదాపుగా 25వేలకు పైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారు లతా మంగేష్కర్. ఆమెను అంతా నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. భారత ప్రభుత్వం లతను పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. అప్పటి నుండి ఇప్పటవరకూ ఆమె పాటలు ఇప్పటవరకూ వినపడుతున్నాయి. అంతేకాదండోయి  ఈమె పాతిన పాటలు ఎంత ఫెమస్ అయ్యాయి అన్న విషయం అందరికి తెలిసిన విషయం. ఇకపోతే ఈమె పాటను ఓ బిక్షకత్తెఎంతో చక్కగా పాడింది. ఆ విషయం తెలుసుకున్న ఈమె ప్రత్యేక అభినందనలు తెలిపింది. అంతేకాదండోయి  ఈమె పాతిన పాటలు ఎంత ఫెమస్ అయ్యాయి అన్న విషయం అందరికి తెలిసిన విషయం. ఇకపోతే ఈమె పాటను ఓ బిక్షకత్తెఎంతో చక్కగా పాడింది. ఆ విషయం తెలుసుకున్న ఈమె ప్రత్యేక అభినందనలు తెలిపింది. 


ఇప్పుడు ఈమె వయసు దాదాపుగా 90 ఏళ్లు. సినిమాలకు పాటలను పాడటం మానేసి చాలా రోజులైంది. కేవలం భక్తి పాటలు మాత్రమే పాడుతుంది.. సినిమాలలో కేవలం బూతులు ఉండటంతో సినిమాలకు పాడలేనని గతంలో అన్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఈమె ఇప్పుడు ఆ పాటలను కూడా పాడలేకపోతున్నరు..ఆమె త్వరలోనే కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: