దాదాపు 105 రోజులు తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ సీజన్ 3 గత ఆదివారం నాడు అనగా నవంబర్ మూడవ తారీకున ముగిసింది. దాదాపు 17 మంది సభ్యులు హౌస్ లోకి ఎంటర్ అవగా చివరాఖరికి టైటిల్ రాహుల్ కి దక్కింది. చివరి వారంలో యాంకర్ శ్రీముఖి మరియు రాహుల్ మధ్య ఓటింగ్లో నువ్వానేనా అన్నట్టుగా రసవత్తరంగా మారి చివరాఖరికి విజయం రాహుల్ ని వరించింది. అయితే రాహుల్ టైటిల్ గెలవడానికి కారణం రాహుల్ ఆడిన గేమ్ చాలా జెన్యూన్ మరియు ముక్కుసూటిగా మనసులో ఉన్నది ఉన్నట్టుగా ఎటువంటి మాస్క్ లేకుండా ఇంటిలో గేమ్ చాలా చక్కగా ఆడారు అందువల్లే రాహుల్ విన్నర్ అయ్యాడు అంటూ రాహుల్ టైటిల్ గెలవడం పై చాలా మంది సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేశారు.


బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఎక్కువగా రాహుల్ పాటిస్పేట్ చేయకపోయినా రాహుల్ గెలవడానికి కారణం జెన్యూన్ గా గేమ్ ఆడటం వల్ల గెలిచారని చాలామంది పేర్కొంటున్నారు. ఇదిలావుండగా సీజన్ 3 లో హౌస్ లో రొమాంటిక్ జంటగా పేరు తెచ్చుకున్న పునర్నవి రాహుల్ లా ఎపిసోడ్ బిగ్ బాస్ జరుగుతున్న తరుణంలో...రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద సంచలనం సృష్టించింది. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న భావన బిగ్ బాస్ రియాల్టీ షో చూస్తున్న వీక్షకులకు మరియు అభిమానులకు కలిగింది. వాళ్లిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.


తనకి ఆల్రెడీ వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని పునర్నవి, తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని రాహుల్ చెప్పినా బయట వినిపించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలతో రాహుల్ బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక అనేక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ తాజా ఇంటర్వ్యూలో పునర్నవి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. విషయంలోకి వెళితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ, 'పునర్నవితో కలిసి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తావా?' అని అంతా అడుగుతున్నారు. నిజంగా అలాంటి ఛాన్స్ వస్తే ఎంతమాత్రం వదులుకోను" అని రాహుల్ తన మనసులోని మాటను చెప్పాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: