హీరోలకు ఉన్నంత కెరియర్ స్పాన్ హీరోయిన్స్ కు ఉండదు. హీరోలు తరతరాలుగా ఇండస్ట్రీని ఏలేస్తుంటారు. కాని హీరోయిన్స్ అలా కాదు. వచ్చామా క్రేజ్ ఉన్నంతకాలం సంపదించామా పెట్టాబేడా సర్ధేసి వెళ్లామా అన్నట్టు ఉంటుంది. తెలుగు సినిమాల్లో ముంబై భామల హవా ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఇక ఆ తర్వాత బెంగళూరు, చెన్నై భామలకు భారీ ఛాన్సులు వస్తుంటాయి.


ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ టాప్ పొజిషన్ కు వెళ్లాలంటే కేవలం అందం అభినయం మాత్రమే కాదు లక్ కూడా ఉండాల్సిందే. అది ఉంటేనే స్టార్ గా ఎదుగుతారు. ఇక ఈమధ్య వచ్చిన ఓ హీరోయిన్ కేవలం ఒకే ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు యూత్ అంతా ఆమె మాయలో పడి పిచ్చివాళ్లవుతున్నారు.


ఆరెక్స్ 100 సినిమాతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది పాయల్ రాజ్ పుత్. హింది సీరియల్స్ లో నటిస్తున్న ఈ అమ్మడిని అజయ్ భూపతి ఏరికోరి మరి తీసుకొచ్చాడు. ఆ సినిమా తర్వాత అమ్మడి రేంజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరెక్స్ 100 తర్వాత ఆర్.డి.ఎక్స్ లవ్ అంటూ వచ్చి రెచ్చిపోయింది పాయల్. ప్రస్తుతం వెంకీమామ, డిస్కో రాజా సినిమాల్లో నటిస్తుంది ఈ చిన్నది.


ఇండస్ట్రీలో కొంతమంది ఈమెను జూనియర్ అనుష్క అని చెప్పుకుంటున్నారట. అనుష్క కూడా మొదట్లో కమర్షియల్ సినిమాల్లో అందాలను గుమ్మరించింది అరుంధతి తర్వాత అమ్మడు ఫీమేల్ లీడ్ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. మొన్నీమధ్య అరుంధతి 2లో పాయల్ రాజ్ పుత్ ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి పాయల్ సొంత ఇమేజ్ తో పాటుగా జూనియర్ అనుష్క అంటూ సరికొత్త క్రేజ్ తెచ్చుకుంది. మరి అనుష్క, పాయల్ ఇద్దరు కలిసి నటిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం.    



మరింత సమాచారం తెలుసుకోండి: