బాలీవుడ్ బికిని గాళ్ గా క్రేజ్ తెచ్చుకున్న దిశా పటాని కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ అంబాసిడర్ గా పూరి న్యాయం చేస్తుంది. ఫెస్టివల్ వచ్చిందంటే చాలు దిశా చెప్పే కెల్విన్ క్లెయిన్ హాట్ విశెష్ గురించి అందరు ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. సినిమాలతో కన్నా తన ఫోటో షూట్స్ తో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది లోఫర్ బ్యూటీ దిశా పటాని. 


తెలుగులో లోఫర్ తర్వాత అడ్రెస్ లేకుండా పోయిన ఈ అమ్మడు ప్రస్తుతం బీ టౌన్ లో హాట్ హాట్ ఛాన్సులు అందుకుంటుంది. సల్మాన్ తో భారత్ సినిమాలో నటించిన దిశా పటాని ప్రభుదేవ డైరక్షన్ లో సల్మాన్ నటిస్తున్న రాధే సినిమాలో కూడా అవకాశం అందుకుంది. ఈ సినిమా డ్యాన్స్ ప్రాక్టీస్ లో దిశా ఒళ్లు హూనమయ్యేలా ప్రాక్టీస్ చేయించాడట ప్రభుదేవ.     


డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరక్టర్ కాబట్టి అటు యాక్షన్ తో పాటుగా డ్యాన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటాడు. అందుకే రాధే సినిమా కోసం దిశాతో గంటలకొద్ది ప్రాక్టీస్ చేయించాడట. ఇంకేముందు ప్రభుదేవ చేసిన పనికి దిశా అలసిపోయి కూలబడ్డది. తన ఒళ్లు హూనం అయ్యేలా ప్రభు మాస్టర్ ప్రాక్టీస్ చేయిస్తున్నాడని ఫోటో పెట్టి మరి హడావిడి చేస్తుంది దిశా పటాని.


దేనిలో అయినా కాంప్రమైజ్ అవుతాడు కాని ప్రభుదేవ డ్యాన్స్ విషయంలో కాంప్రమైజ్ అన్న దానికి ఛాన్స్ ఇవ్వడు. అందుకే అటు సల్మాన్ తో పాటుగా దిశా పటానితో కూడా హార్డ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాడట. భారత్ సినిమాలో సల్మాన్, దిశా సాంగ్ స్టెప్పులు అదిరిపోయాయి. అందుకే ఈ కాంబోలో మళ్లీ అదరగొట్టే స్టెప్పులు వేయించాలని చూస్తున్నాడు ప్రభుదేవ. తన హాట్ లుక్స్ తో బాలీవుడ్ ఆడియెన్స్ కు నిద్రపట్టకుండా చేస్తున్న దిశా పటాని రాధేతో మరింత క్రేజ్ తెచ్చుకుంటుందని అంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: