యంగ్ బ్యూటీ యామిని భాస్కర్ తెలుగులో నాగశౌర్య సరసన నర్తనశాల చిత్రంలో నటించింది.యామిని భాస్కర్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. యామిని అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. నర్తనశాల చిత్రంలో యామిని అందాలు ఆరబోసి కుర్రకారుని ఆకట్టుకుంది. కానీ ఆ చిత్రం విజయం సాధించలేదు. ప్రస్తుతం యామిని టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యామిని భాస్కర్ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తోంది. ట్రెండీ డ్రెస్ అయినా, చీర కట్టులో అయినా గ్లామర్ లుక్ తో ఆకట్టుకుంటోంది. బ్లాక్ డ్రెస్, సారీ, ట్రెండీ అవుట్ ఫిట్స్ లో యామిని భాస్కర్  ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 


‘కీచక’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి యామిని భాస్కర్. ఆ తరవాత ‘రభస’, ‘కాటమరాయుడు’ చిత్రాల్లో నటించింది. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన రభస సినిమాలో ఈమె కూడా నటించింది. అందులో చేసింది చిన్న పాత్రే. అయితే రభస ఫ్లాప్ కావడంతో యామిని గురించి ఎవరికీ తెలియకుండా పోయింది.  నాగశౌర్య హీరోగా నటించిన నర్తనశాల సినిమాలో బికినీ కూడా వేసి ఔరా అనిపించింది ఈ ముద్దుగుమ్మ. అదీ ఫ్లాప్ కావడం ఈమెకు మైనస్ అయిపోయింది. దాంతో అన్ని దారులు మూసుకుపోవడంతో ఇప్పుడు అందాల దారులు ఓపెన్ చేసింది. ఇప్పుడు హీరోయిన్స్ ఎక్కువ‌గా వ‌స్తుండ‌టంతో అప్ష‌న్స్ ఎక్కువ అయ్యాయి. దాంతో పోటీ ఎక్కువైంది. అందుక‌నే ఎక్కువ మంది హీరోయిన్స్ కంటిన్యూగా సినిమాలు చేయ‌లేక‌పోతున్నార‌న్న విష‌యం కూడా తెలిసిందే. అయితే ఇలాంటి తెలుగ‌మ్మాయిల‌ను ఎంక‌రేజ్ చేస్తే చాలా బావుంటుంద‌ని ప‌లువురు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు భావిస్తున్నారు. కానీ తెలుగమ్మాయిల ప‌రిస్థితి ఎలా ఉంటుందంటే టాలెంట్ ఉన్నా కూడా ల‌క్ ఉంటేనే క‌లిసొచ్చే నేప‌ధ్యంలో ఒక‌టి రెండు సినిమాల త‌ర్వాత అవ‌కాశాలు దొర‌క‌డం క‌ష్ట‌మ‌యిపోయింది. ఈ నేప‌ధ్యంలో వాళ్లు ఇలా గ్లామ‌ర్ షూట్ చేసి ఫొటోస్‌ను వైర‌ల్ చేస్తూ అవ‌కాశాల కోసం ఎదురుచూడాల్సి వ‌స్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: