నిన్నటితో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాను ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తి అయింది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ అనుకున్న విధంగా జరగక పోవడంతో రాజమౌళి టెన్షన్ తారా స్థాయికి చేరుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ లో 50 శాతం కూడ పూర్తి కాలేదు అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి.

దీనితో రాజమౌళి జూనియర్ చరణ్ లకు షిప్ట్ లు వేసి ఉదయం నుండి అర్థరాత్రి వరకు ఈ మూవీ షూటింగ్ ను పరుగులు తీస్తున్నట్లు సమాచారం. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక స్పెషల్ సెట్ లో రాజమౌళి జూనియర్ తో రాత్రి పూట షూట్ చేస్తూ కోకాపేట లోని ఒక ఖాళీ ప్రదేశంలో వేసిన మరొక సెట్ లో రామ్ చరణ్ ఫై పగటి పూట ఈ మూవీ షూటింగ్ ను పరుగులు తీయిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆ తరువాత జూనియర్ ను పగటిపూట షూటింగ్ షెడ్యూల్ కు మార్చి చరణ్ ను రాత్రి షెడ్యూల్ కు మార్చే విధంగా రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ను అనుకున్న విధంగా వచ్చే ఏడాది విడుదల చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. అయితే సమస్య అంతా ఈ మూవీలో నటిస్తున్న హీరోయిన్స్ వలన వస్తోందని అలియా భట్ డేట్స్ రకరకాల కారణాలతో ఆలస్యం అవుతున్న నేపధ్యంలో చరణ్ అలియా భట్ లపై తీయవలసిన సీన్స్ ఇంతకువచ్చి ప్రారంభం కాలేదు అని అంటున్నారు. 

జూనియర్ పక్కన నటించవలసిన బ్రిటీష్ బ్యూటీ డైసీ హ్యాండ్ ఇచ్చిన తరువాత రాజమౌళి ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి సమర్థత గల హాలీవుడ్ బ్యూటీ దొరకడం కష్టంగా మారడంతో ఆ పాత్రను ఎవరైనా బాలీవుడ్ నటిచేత చేయిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ రాజమౌళికి వస్తున్నట్లు టాక్. దీనికితోడు ఈ సినిమాలోని జూనియర్ చరణ్ ల ఫస్ట్ లుక్ ను విడుదల చేయమని అభిమానుల నుండి వస్తున్న ఒత్తిడి కూడ రాజమౌళి తట్టుకోలేక పోతున్నాడని దీనితో జక్కన్నలో ఎప్పుడు చూడని అసహనం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ స్పాట్ లో కనిపిస్తోంది అంటూ కొందరు ఈ షూటింగ్ ను చూసినవారు చెప్పుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: