జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రస్తుతం సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఎన్నో అంచనాలు మరియు ఆశలు పెట్టుకొని దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రభాస్ ‘సాహో’ సినిమా చేయడం జరిగింది. అయితే ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్ కి దిమ్మతిరిగి పోయినా ప్రభాస్ కి తన తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కెరియర్ పరంగా ‘బాహుబలి’ ఏవిధంగా తనకి పేరు తెచ్చిందో ఆ పేరును మరియు తన మార్కెట్ చేజారిపోకుండా తగు జాగ్రత్తలు ప్రస్తుతం తీసుకోవడం మొదలు పెట్టారు. ఇటువంటి నేపథ్యంలో డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న పాతకాలం నాటి ప్రేమ కథ చిత్రం లో డైరెక్టర్ ఈ సినిమాని చాలా రిచ్ గా హై క్వాలిటీ తో తెరకెక్కించాలని సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంగా భావించి కేవలం విదేశాలలో చిత్రీకరణ కోసం దాదాపు 40 సెట్లు వేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్న డైరెక్టర్ కి మరియు నిర్మాతలకు వారి అనుకున్న ఆలోచనలకు తాజాగా ప్రభాస్ చెక్ పెట్టినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.


విషయంలోకి వెళ్తే ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి నిర్మాతలు ప్రభాస్ స్నేహితులు. గోపి కృష్ణ బ్యానర్ మరియు యువి క్రియేషన్స్ సంస్థ ఈ రెండు నిర్మాణ సంస్థలు ప్రభాస్.. రాధాకృష్ణ తో చేస్తున్న సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ రెండు నిర్మాణ సంస్థల అధినేతలు ఒకరు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అయితే మరొకరు ప్రభాస్ కి అత్యంత సన్నిహితంగా ఉండే ప్రాణ స్నేహితులు.


అదే విధంగా సాహో సినిమాని నిర్మించిన నిర్మాతలు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయంలో అనవసరపు ఖర్చులకు వెళ్ళకూడదు అంటూ నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చినట్లు ఫిలింనగర్లో వినపడుతున్న టాక్. అంతే కాకుండా విదేశాల్లో కి వెళ్లి వేయాలనుకున్న సెట్లను హైదరాబాదు లోనే ఏదో ఒక స్టూడియోలో వేయాలని నిర్మాతలకు ప్రభాస్ సూచించాడట. మొత్తం మీద సాహో సినిమా ఇచ్చిన రిజల్ట్ కి ప్రభాస్ చాలా జాగ్రత్తలే నిర్మాతల గురించి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: