టాలీవుడ్ లో ప్రస్తుతం యువ హీరోల హవా కొనసాగుతుంది.  ఇప్పటికలే నాని, రామ్, మెగా హీరోలతో పాటు ఈ మద్య 'నేను వీడని నీడను నేనే' వంటి హారర్ థ్రిల్లర్ చేసిన సందీప్ కిషన్ సైతం విభిన్నమైన కథనాలతో వస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.  'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' అనే పూర్తిస్థాయి కామెడీ కంటెంట్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. హన్సిక కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక కామెడీ మూవీస్ తెరకెక్కించడంలో దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి సిద్ధహస్తుడు.


తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'  ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  ప్రస్తుతం సొసైటీలో నానా రకాల సమస్యలతో అందరూ సతమతమైపోతున్నారు. అలాంటి వాళ్లందరినీ కాసేపు నవ్వించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తీశాను. ఈ మధ్య కాలంలో పూర్తిస్థాయి కామెడీ మూవీ రాలేదు.  ఈ మూవీ ఓ సామాన్యమైన లాయర్ గురించిన కథ..అతని ముందు ఓ కాంప్లికెటడె కేసు వస్తే ఎలా డీల్ చేశాడు అన్నదానిపై తీసిన మూవీ అన్నారు. ఈ మూవీలో కామెడీతో పాటు ఎమోషన్స్, సెంటిమెంట్ కూడా ఉంటుందని అన్నారు. 


సందీప్ కిషన్ ఈ మూవీ  ప్రాణం పెట్టి చేశారు. ఇందులో నటీనటులు తమ నటనతో మెప్పించారు. మరో విషయం ఏంటేంటే..నేను ఈ సినిమాను తీయడానికి అది కూడా ఒక కారణం ఉంది. పూర్వ కాలంనాటి తెనాలి రామకృష్ణుడికి .. ఈ కథలోని హీరోకి చాలా దగ్గర లక్షణాలు ఉంటాయి. ఇక తెనాలి రామకృష్ణ అంటే తెలియని వారు ఉండరు.. అందువల్లనే ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ మూవీలో  పోసాని, వెన్నెల కిషోర్,సప్తగిరి పాత్రలు కూడా నాన్ స్టాప్ గా నవ్విస్తారని అన్నారు. మరి ఈ మూవీ సందీప్ కిషన్ కి ఎంత వరకు హిట్ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: