తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అయినా మరియు సినిమాకి సంబంధించి హీరోల అభిమానులను అయినా వేదికపై యాంకర్ చేస్తే హ్యాండిల్ చక్కగా చేయగల యాంకర్ సుమ. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారికి ఆమె బాగా సుపరిచితురాలు. ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల ఆడియో వేడుకలకు ప్రమోషన్ కార్యక్రమాలు కచ్చితంగా సుమ యాంకరింగ్ ఉండాల్సిందే. అంతగా ఆమె యాంకరింగ్ కోసం ఇండస్ట్రీకి చెందిన పెద్దలు మరియు స్టార్  హీరోలు ఆరాటపడతారు. ఆమె డేట్స్ కోసం ఎంతగానో ఆశగా ఎదురు చూస్తారు. స్వతహాగా సుమా మలయాళీ అయినప్పటికీ చిన్నప్పటినుండి తెలుగువారి మధ్య పెరగటంతో తెలుగుభాషపై అద్భుతమైన పట్టు సాధించింది. ఇదిలా ఉండగా తాజాగా యాంకర్ సుమ పై ఆమె భర్త రాజీవ్ కనకాల తాజాగా షాకింగ్ కామెంట్ చేశారు.


గతంలో అనేక సార్లు పాలు ఇంటర్వ్యూలలో తన భార్య సుమ గురించి మాట్లాడిన రాజీవ్ కనకాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. విషయంలోకి వెళితే ఆ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తావన రాగా...రాజీవ్ కనకాల సమాధానమిస్తూ...నా భార్య సుమ చాలా షోలు చేస్తుంది...కానీ సంపాదనలో సంపాదించేది చాలా తక్కువేనని..ఇన్ని సంవత్సరాలుగా.. షూటింగ్‌లో పెద్ద పెద్ద లైట్స్ మధ్య కష్టపడుతూ వచ్చిందని చెప్పుకొచ్చారు.


అలాగే.. తన వెనుక నేను ఉన్నానని అనుకుంటారు. కానీ.. నిజానికి అందంతా ఆమె టాలెంట్‌నే.. నేను సలహాలు మాత్రమే ఇస్తాను తప్ప.. క్రెడిట్స్ తీసుకోనని చెప్పాడు రాజీవ్ కనకాల. అలాగే.. మరో విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ.. తన రెమ్యునరేషన్ ఎంతో కూడా తనకు తెలీదని.. మేము అసలు వాటి గురించి ఇంట్లో ప్రస్తావించమని చెప్పుకొచ్చాడు. సుమకు ఇవ్వాల్సిన స్పేస్ ఇచ్చేస్తానని.. ఇతర వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోనని’ రాజీవ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో రాజీవ్ కనకాల చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: