హీరో రామ్ చరణ్ అనగానే మనందరికీ గుర్తోచ్చేది ఒకటే ఆయన స్టెప్పులు ,డ్యాన్స్ .అయన నటన తో అభిమానులందర్నీ ఆకట్టుకున్నాడు ఎన్నో గొప్ప చిత్రాలలో అయన పాత్రలకు  ప్రాణంపోసినట్టుగా  నటించారు. కొన్ని సినిమాలలో తండ్రి మెగాస్టార్ తో నటించే అవకాశాన్ని పొందారు . ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి రామ్‌చరణ్‌ నటించిన ‘మగధీర, బ్రూస్‌లీ’ సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు . ఆ చిత్రాలలోని  సన్నివేశాలకు మంచి స్పందన లభించింది.

రామ్‌చరణ్‌ మెగాస్టార్ చిరంజీవి కమ్‌బ్యాక్‌ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’లోని ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు...’ పాటలో తండ్రితో కలిసి స్టెప్పులేశారు.ఇటీవల రామ్ చరణ్‌ని   మీ నాన్నగారితో కలసి ఫుల్‌ సినిమాలో నటించాలని లేదా? అనే ప్రశ్నను అడిగితే ఈ విధంగా బదులిచ్చారు. ‘‘సైరా’ సినిమా కథా చర్చలు నడుస్తున్నప్పుడు షేర్‌ఖాన్‌ అనే అతిథి పాత్ర నాకు ఉంటుందని చెప్పారు. అయితే చర్చలు పూర్తయ్యేసరికే నా పాత్రను పేపర్‌ మీదే ఎడిట్‌ చేసేశారు.


 నాన్నగారు ‘మేమిద్దరం కలసి నటిస్తాం’ అని ఈ మధ్య ఓ సందర్భంలో చెప్పారు. అయితే అది ఏ సినిమాను ఉద్దేశించి అన్నారో నాకు కూడా తెలియదు. ప్రస్తుతం నాన్నగారు మూడు నాలుగు కథలు విన్నారు. అందులో ఏ కథలో, ఏ పాత్రలో నన్ను చూస్తున్నారో ఆయనకు మాత్రమే తెలుసు.


ఆల్రెడీ ‘సైరా’లో నా పాత్ర ఉంటుందన్నారు. లేదు. అందుకే ముందే ఆశపెట్టుకోవడం లేదు. ‘కథలో నువ్వుంటే బావుంటుంది’ అని ఆయన ఎప్పుడు చెబితే అప్పుడు నాన్నగారితో కలిసి నటిస్తాను’’ అని పేర్కొన్నారు రామ్‌చరణ్‌. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించనున్న సినిమాను రామ్‌చరణే నిర్మించనున్నారు. ‘ఖైదీ నంబర్‌ 150’, ‘సైరా’కి కూడా చరణే నిర్మాత అనే సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: