సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు
మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి.
మహేష్ బాబుకు హిట్లు కొత్త కాదు,
సంక్రాంతి హిట్లు కూడా కొత్త కాదు. అయితే
మహేష్ కెరీర్ మొత్తంలొ సంక్రాంతికి రెండో మూడో మూవీస్ రిలీజ్ అయ్యాయి. అవి బాగానే ఉన్నాయనిపించుకున్నాయి. హిట్లూ కొట్టాయి.
2020 సంక్రాంతి మాత్రం
మహేష్ కి స్పెషల్. పోటీ గట్టిగానే ఉంది. మరి
సూపర్ స్టార్ ఏ విధంగా ఈ విధమైన పోటీని ఎదుర్కొంటాడో చూడాలి.
ఇదిలా ఉండగా బన్నీ దూకుడు అలా ఇలా లేదు.
సంక్రాంతి మూడు నెలలు ముందుగా ఉండగానే బన్నీ తన అల వైకుంఠపురంలో మూవీకి హైప్ తీసుకువచ్చేశాడు. ఆ
మూవీ సాంగ్స్ రెండు రిలీజ్ చేస్తే రెండూ అదరహో అనిపించాయి. ఇక అంచనాలు అయితే ఆకాశాన్ని అంటాయి, ఆ విషయంలో
మహేష్ అబాబు సరిలేరు నీకెవ్వరు కాస్తా వెనకబడిందని అంటున్నారు. అన్నీ ఉన్నా కూడా ప్రమోషన్లో ఎందుకు బాక్ అయ్యారో మరి అంటున్నారు.
సూపర్ స్టార్ మూవీ,
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఉంది. ఈ ఏడాది సంక్రాంతి వీరుడు
అనిల్ రావిపూడి
డైరెక్టర్ గా ఉన్నాడు. మ్యూజిక్ మ్యాజిక్
దేవిశ్రీ ప్రసాద్ కూడా పెద్ద అసెట్ గా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో ఎన్నో స్పెషల్స్ ఉన్నాయి. అయినా
అనిల్ ఎందుకు ప్రమోషన్ గట్టిగా చేయడంలేదన్న కామెంట్స్ పడుతున్నాయి.
అయితే నిదానమే ప్రదానంగా ఈ
మూవీ ప్రమోషన్ విషయంలో ఉన్నారని అంటున్నారు. ఇక తొందరలో సాంగ్స్ రిలీజ్ చేయడం ద్వారా హైప్ తీసుకువస్తారని అంటున్నారు. ఇక ఈ మూవీలో ఫుల్ ఫీస్ట్ గా
అనిల్ మార్క్
కామెడీ ఉంటుందని అంటున్నారు. ఈ
మూవీ విషయంలో
ట్రైన్ ఎపిసోడ్ లో వచ్చే కామెడీకి జనాలు కడుపుబ్బా నవ్వుతారని అంటున్నారు. మరి చూడాలి
అనిల్ మహేష్ ఏ రకమైన మ్యాజిక్ చేస్తారో.