సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్, సినిమా అంటేనే గ్లామర్. కాబట్టి సినిమాల్లో హీరోయిన్స్ అన్నాక అందాల ఆరబోత, లిప్‌లాక్స్ చేయక తప్పదు. అయినా ఇలాంటివి తమ వృత్తిలో భాగమే అని, కథ డిమాండ్ చేస్తే చేయక తప్పదని ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఓపెన్ అయ్యారు కూడా. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా అదే మాట చెబుతోందట. డిమాండ్ ఉంటే దానికైనా రెడీ అంటోందట. దీంతో ఈ ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.


పెళ్ళికి ముందే టాలీవుడ్ చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది సమంత. గ్లామర్ రోల్స్ కూడా పోషించి ప్రేక్షకులకు కిక్కిచ్చింది. అయితే ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత. ఈ మధ్యకాలంలో పాత్రల ఎంపికలో స్పెషల్ కేర్ తీసుకుంటోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల పట్ల మక్కువ చూపుతోంది.అక్కినేని వారింట అడుగు పెట్టాక మొదటిసారి భర్త నాగచైతన్యతో కలిసి 'మజిలీ' చేసింది సమంత. ఈ సినిమాలో గృహిణిగా, చైతూ భార్యగా భేష్ అనిపించుకున్న సామ్.. ఆ వెంటనే 'ఓ బేబీ' సినిమాకు కమిట్ అయింది. 


Image

ఇక మరికొద్ది రోజుల్లోనే 96 రీమేక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది సమంత. ఈ సినిమాలో శర్వానంద్‌తో రొమాన్స్ చేసిన ఆమె.. మరో విలక్షణ పాత్ర పోషించిందని సమాచారం. కాగా 96 రీమేక్‌ తర్వాత తన తదుపరి చిత్రాల మీద దృష్టి పెట్టిన సమంత. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు సిద్దమే అని చెబుతోందట. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్‌ కథల కోసం ఎదురుచూస్తున్న సమంత, కథ బాగుండాలే గానీ కొత్త దర్శకులతో అయినా రెడీ అనేందుకు సిద్ధమైందని సమాచారం


ఇక కథ డిమాండ్ చేస్తే తాను బోల్డ్ సీన్లలో నటించేందుకు కూడా వెనకాడనని నిర్మొహమాటంగా తన సన్నిహితులతో చెప్పుకుంటోందట సామ్. ఈ మేరకు అతి త్వరలో ఓ కథ ఫైనల్ చేయాలని బలమైన డిసీజన్ తీసుకుందట సమంత. ఏదేమైనా సమంత తీరే వేరులే. 


మరింత సమాచారం తెలుసుకోండి: