మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ మూవీ గురించి ఎప్పటికపుడు కొత్త అప్ డేట్స్ వస్తున్నాయి. అవి ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ మూవీపై కొత్త అంచనాలు పెంచుతున్నాయి. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు అదరహో అన్న రేంజిలో  ఉన్నాయి. ఇక ఆర్మీ మేజర్ గా మహేష్ కొత్త గెటప్ చూసి కిర్రాకు అవుతున్నారు అభిమానులు.


ఇవన్నీ ఇలా ఉంటే ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక ఐటం సాంగులో మెరుస్తుందని అంటున్నారు. తమన్నా మహేష్ అంతకు ముందు ఆగడు మూవీలో జోడీ కట్టారు. ఆ మూవీలో సాంగ్స్ ఫుల్ గ్లామర్ తో ఉంటాయి. ఇద్దరి వైట్ అండ్ వైట్ మ్యాచ్ తో ఇంద్రధనుస్సునే వెండి తెర మీద ఆరబోశారు. ఇపుడు కూడా ఈ జంట  మరో మారు జోడీ కట్టి హుషార్ చేయబోతున్నారు.


ఈ మూవీలో మహేష్ పక్కన్న తమన్నా ఓ కైపెక్కించే సాంగ్ లో కనిపించి కనువిందు చేస్తుందట. మూడు పదుల వయసులో ఉన్నా ఎక్కడా తన అందం తగ్గలేదని ఎఫ్ టూ మూవీలో ప్రూవ్ చేసుకున్న తమన్నా ఇపుడు కూడా అదే గ్రేస్ జోష్ చూపిస్తుందట.  ఇది ఫ్యాన్స్ ఒక గిఫ్ట్ గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సాంగ్ హీరో ఇంట్రడక్షన్లో వస్తుందని అంటున్నారు.


ఇది కాకుండా మరో ఐటం సాంగ్ ని కూడా డైరెక్టర్ అనిల్ రావిపూడి డిజైన్ చేశారని అంటున్నారు. ఆ సాంగ్ ని ఆయన ఎవరితో చేయిస్తారన్నది ఇప్పటికైతే సస్పెన్స్. కానీ అద్భుతమైన సౌందర్యమే ఆ సాంగ్ చేస్తుందని అంటున్నారు. సో ఈ మూవీలో రెండు ఐటం సాంగ్స్ తో అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు ఆడియన్స్ కి కూడా  మజా కలిగిస్తాయన్నమాట. చూడాలి మరి ఏ రేంజిలో ఈ సాంగ్స్ విజూవ‌లైజ్ చేసి జనాలను మెస్మరైజ్ చేస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: