ఎప్పుడు ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ తన అభిమానులను ఆకట్టుకునే అమిర్ ఖాన్.. ఈసారి ఇతను అమిర్ ఖాన్ ఏ నా అని ఆశ్చర్యపోయే విధంగా మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఇంకా విషయానికి వస్తే.. వైవిధ్యమైన పాత్రల్లో నటించే అమిర్ ఖాన్ ఇప్పుడు కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'లాల్‌ సింగ్‌ చద్దా’లో నుంచి ఆమీర్‌ ఖాన్ లుక్‌ లీక్ అయ్యింది. 


గుబురు గెడ్డం, తలపై టర్బన్‌, టక్‌ చేసుకున్న ఆమీర్‌ నడిచి వస్తున్న ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చింది. దీంతో ఆ ఫోటోను చుసిన అభిమానులు మొదట ఎవరో అని అనుకున్న మళ్ళి అది అమిర్ ఖాన్ అని తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చండీగఢ్ లో జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణలో కరీనా కపూర్ కూడా పాల్గొంటుంది.


అయితే ఆమె ఫోటో కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఇద్దరి స్టార్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా హాలీవుడ్‌లో విజయవంతమైన 'ఫారెస్ట్‌ గంప్‌' సినిమాకు రీమేక్‌గా 'లాల్‌ సింగ్‌ చద్దా' తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా కోసం అమిర్ ఖాన్ 20 కిలోల బరువు తగ్గారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా తెలియలేదు. 


view this post on Instagram

#AamirKhan as #laalsinghchaddha on the sets in chandigarh #photooftheday #sunday

A post shared by Manav Manglani (@manav.manglani) on


మరింత సమాచారం తెలుసుకోండి: