వివాదాలకి కేంద్ర బిందువుగా మారిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు స్నే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల ౨౯ వ తేదీన విడుదల చేస్తారని సమాచారం. అయితే ఆ విషయం అటుంచితే, రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. అప్పటి వరకు ఉన్న సినిమాని ఒక్కసారిగా మార్చేశాడు. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమ అనంతరం క్షణ క్షణం, ఇంకా చాలా సినిమాలు చేశాడు.


అయితే, దర్శకుడిగా ఉన్న రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా కూడా మారాడు. నిర్మాతగా మారి తన అసిస్టెంట్ డైరెక్టర్లని దర్శకులుగా చేసి సినిమాలు నిర్మించాడు. అప్పటి వరకు ఆ సాంప్రదాయం ఎక్కడా లేదు. ఒక దర్శకుడు తన అసిస్టెంట్ ని డైరెక్టర్ గా చేయడం అనేది టాలీవుడ్ లో సంచలనమే. ఇప్పటి వరకు చాలా మంది అసోసియేట్ డైరెక్టర్లతో సినిమాలు నిర్మించాడు. అయితే రామ్ గోపాల్ వర్మ తర్వాత అసిస్టెంట్లని పరిచయం చేసినవాళ్ళు చాలా తక్కువ మంది.


ఇప్పటి దర్శకులలో ముఖ్యంగా సుకుమార్ తన అసొసియేట్లకి అవకాశం కల్పిస్తున్నాడు. కొన్ని సినిమాలకి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా కొన్ని సినిమాలు మెటిరియలైజ్ కావడానికి సుకుమార్ సాయపడుతున్నాడు. పెద్ద పెద్ద దర్శకులైన రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి దర్శకులు సైతం ఇలా చేయలేదు. అయితే ప్రస్తుతం ఈ లిస్ట్ లో మరో దర్శకుడు కూడా చేరబోతున్నాడు.


సైరా సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి తన అసోసియేట్స్ తో సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నాడట. తన అసోసియేట్ దర్శకులలో ఒకరికి దర్శకత్వ బాధ్యతలు ఇచ్చి తాను నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందట. మరి మిగతా దర్శకులలో ఎంత మంది దీన్ని ఫాలో అవుతారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: