తెలుగు చిత్ర రంగంలో పాత తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన హీరోలు కృష్ణ, శోభన్ బాబు అని చెప్పొచ్చు.  అప్పట్లో అందగాడిగా పేరు తెచ్చుకొని మహానటులు ఎన్టీఆర్ మెప్పు పొందిన నటులు శోభన్ బాబు.  ఆయనని అప్పట్లో సోగ్గాడుగా పిలిచేవారు.  ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా శోభన్ బాబు ఎన్నో సినిమాల్లో నటించారు. స్టార్ హీరోయిన్లు ఆయన సరసన నటించడానికి ఎంతో ఉత్సాహం చూపించేవారని టాక్ ఉంది.  ఇక తెలుగు చిత్ర సీమలో నూతన ఒరవడి సృష్టించి జేమ్స్ బాండ్ తరహా సినిమాలకు ఆద్యం పోసిన నటులు సూపర్ స్టార్ కృష్ణ. 

బ్లాక్ అండ్ వైట్ తెరపై ఆయన చేసిన విన్యాసాలు అప్పట్లో హాలీవుడ్ సన్నివేశాలు తలపించేవి.  కౌబాయ్ తరహా సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా తెలుగు చిత్ర సీమలో ఓ ట్రెండ్ సృష్టించింది.  తాజాగా  సీనియర్ దర్శక, నిర్మాత చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఈ ఇద్దరు హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  శోభన్ బాబు తనకు స్టార్ డమ్ రావడానికి చాలా ఏళ్లు కష్టపడ్డారని..ఓ క్రమపద్దతితో ఉండేవారని అన్నారు.  శోభన్ బాబు కి ముందు చూపు ఎక్కువగా ఉండేదని..అందుకే ఆయన సంతానాన్ని సినిమా వైపు కాకుండా వ్యాపార రంగం వైపు మల్లించారని అన్నారు. 

అప్పట్లోనే ఆయన రియల్ ఎస్టేట్ లో చాలా డబ్బు వెచ్చించడంతో ఇప్పుడు అవి పదింతలు పెరిగాయని అన్నారు. చివరి రూపాయి ఇస్తేనే గాని ఆయన డబ్బింగ్ చెప్పేవారు కాదు. సాయంత్రం 6 కాగానే ఆయన 'విగ్' తీసేసేవారు. ఈ విషయాలన్నీ ఆయన ముందుగానే మాట్లాడుకుని ఆ ప్రకారమే చేసేవారు. ఇక నటశేఖర్ కృష్ణ ఇందుకు పూర్తి విరుద్దమని అన్నారు.  ఆయన సినిమా షూటింగ్  సమయాన్ని గురించి ఎప్పుడూ పట్టించుకునేవారు కాదు. రాత్రి 11 అయినా .. 12 అయినా షూటింగులోనే ఉండేవారు.

కొన్ని సార్లు ఎంత రిస్క్ షాట్స్ అయినా చేసేవారు..గాయాల పాలైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని అన్నారు. నిర్మాతల అవసరాలను ఆయన దృష్టిలో పెట్టుకునేవారు. భారీ బడ్జెట్ సినిమాలు సక్సెస్ కాకపోతే వచ్చే నష్టాలు వస్తాయని అందుకే కొన్ని సినిమాలు ఆయనే స్వయంగా నిర్మించారని అన్నారు. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాలు అప్పట్లో మంచి విజయాలు అందుకున్నాయని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: