ఈ సంవత్సరం వచ్చిన చిత్రాల్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీసును షేక్ చేసిన చిత్రం "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ". ఇంతకుముందు చిన్న చిన్న పాత్రలు చేసిన నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. కొత్త దర్శకుడు స్వరూప్ ఈ సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు. అసలు ఎలాంటి అంచనాలు  లేకుండా వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా మంచి వసూళ్ళు సాధించింది.


తెలుగు తెరపై ఇంతకుముందెన్నడూ చూడని కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. కొత్త కథ కావడం, తెలుగులో మంచి విజయం సాధించడంతో వేరే భాషల వాళ్లకూ ఈ సినిమాపై ఆసక్తి పుట్టింది. ముందుగా ఈ కథ తమిళంలోకి వెళ్లబోతున్నట్లు సమాచారం. అయితే తమిళంలో ఎవరు నటించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. తమిళంలో కమెడియన్ గా చేసి మంచి పేరు సంపాదించుకున్నసంతానం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడని సమాచారం. 


సంతానం కమెడియన్ గా ఎందరో స్టార్ హీరోల పక్కన చేశాడు. అటు కమెడియన్ గా కొనసాగుతూనే హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. సంతానంకి హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. తనకి నప్పేటటువంటి సినిమాలని ఎంచుకుంటూ ఎక్కడా కామెడీని మిస్ అవకుండా చూసుకుంటున్నాడు.ఈ మధ్య వచ్చిన ‘రాజు గారి గది-3’ తమిళ వెర్షన్లోనూ సంతానం హీరోగా నటించాడు. 


‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి కామెడీ టచ్ ఉన్న థ్రిల్లర్ మూవీ సంతానంకు బాగానే సూటయ్యే అవకాశముంది.  మరి ఈ చిత్రానికి తెలుగులో దర్శకత్వం వహించిన స్వరూప్ దర్శకత్వం వహిస్తాడా లేదా వేరే వాళ్ళు దర్శకత్వం చేస్తారా అనేది తెలియాలి.  తెలుగులో సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రం తమిళంలో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: