మెగా గోల్డెన్ ఛాన్స్ ను దర్శకుడు సుకుమార్ చేజేతులారా.. వదిలేశాడా.? రీమేక్ ని హ్యాండిల్ చేయడం ఇష్టంలేకే స్టార్ డైరెక్టర్ మెగా ఛాన్స్ కు నో చెప్పాడా?  మెగా కాంపౌండ్ ఏరికోరి ఎంచుకుంటే సుకుమార్ ససేమిరా అన్నాడా?  ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ఇదే న్యూస్ చక్కర్లు కొడుతోంది. 


టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ కు ఉన్న స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ కాంపౌండ్ నుంచి ఛాన్స్ రావడం డైరెక్టర్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ లా ఫీలవుతుంటారు. ముఖ్యంగా ఆ కాంపౌడ్ లో అడుగుపెట్టి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కలలు కంటారు. అలా చిరంజీవిని డైరెక్ట్ చేసే అరుదైన అవకాశాన్ని దర్శకుడు సుకుమార్ చేజేతులారా.. మిస్ చేసుకున్నట్టు వినిపిస్తోంది. 


మెగా తనయుడు రామ్ చరణ్ రీసెంట్ గా మలయాళం బ్లాక్ బస్టర్ లూసీఫర్ రీమేక్ రైట్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో నటించేందుకు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ చిరంజీవికి కుదరకపోతే పవన్ కళ్యాణ్ తో ఈ రీమేక్ పట్టాలెక్కించాలని రామ్ చరణ్ ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ రీమేక్ ను డైరెక్టర్ సుకుమార్ అయితే బాగా హ్యాండిల్ చేస్తాడని చరణ్ భావించాడట. ఇదే విషయాన్ని చరణ్, సుకుమార్ దృష్టికి తీసుకెళ్లితే ఈ దర్శకుడు నో చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. 


లూసీఫర్ రీమేక్ కు సుకుమార్ నో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ కొన్నాళ్లు పక్కన పెట్టాలని చరణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ ఇప్పటి వరకూ రీమేక్ సినిమాలు చేయలేదు. ఆయన రాసుకున్న కథలతోనే సినిమాలు చేస్తారు. రొటీన్ కు భిన్నంగా ఉండే ఈ దర్శకుడు.. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి తీసుకున్నా మన నేటివిటీని మిస్ కాకుండా చూసుకుంటాడు. సొంత కథలతోనే సిినిమాలు చేసేందుకు ఇష్టపడే సుకుమార్ రీమేక్ అనే సరికి  చరణ్ కు నో చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది త్వరలోనే తెలియనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: