సినిమా హీరోల మీద ప్రేమ అభిమానం హద్దుమీరితే ఎలా ఉంటుందో ఈ సంఘటన చూస్తే అర్ధమవుతుంది. అమెరికాలో ఉంటున్న ఓ ప్రేమికుల జంట మధ్య హృతిక్ రోషన్ వల్ల ఏర్పడిన చిచ్చు రెండు ప్రాణాలు పోగొట్టుకునేలా చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న దినేశ్వర్, డోనే డొజోయ్ ఇద్దరి ప్రేమించి పెళ్లాడారు. 


అయితే డోనేకి హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమట. రోజు ఆమె భర్త దినేశ్వర్ ను కూడా హృతిక్ రోషన్ లా తయారు అవ్వాలని గొడవ చేసేదట. రాత్రుళ్లు హృతిక్ ను కలవరించడం.. తన భర్తను కూడా హృతిక్ లా ఫీల్ అవడం చేస్తుందట. మొదట్లో సరదాగా అనుకున్నా రాను రాను హృతిక్ రోషన్ ను తలచుకుంటూ రోజు గొడవపడటం చేసేవారట. ఈ గొడవ ఒకసారి పోలీసుల దాకా వెళ్లిందని తెలుస్తుంది.   


ఇక దినేశ్వర్ ను జైలులో పెట్టించిన డోనే మీద కోపంతో ఆమెను హతమార్చాడు దినేశ్వర్ అంతేకాదు అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హృతిక్ రోషన్ మీద ఉన్న అభిమానం ఇలా రెండు ప్రాణాలను బలి అయ్యేలా చేసింది. అభిమానం అనేది ఉండాలి కాని ఇలా అర్ధరహితంగా విచక్షణ లేకుండా ఉండే అభిమానం కూడా జీవితాలను నాశనం చేస్తుందని దినేశ్వర్, డోనేలను చూస్తే తెలుస్తుంది.          


ప్రస్తుతం వీరి కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారట. వీరిద్దరి భారతీయులే కావడం విశేషం. హృతిక్ రోషన్ మీద అభిమానం వల్ల తన భర్తతో సరిగా కాపురం చేయక లేని పోని గొడవలతో డోనే నూరేళ్ల జీవితాన్ని పాడుచేసుకుంది. కేవలం సినిమా హీరో వల్ల రెండు నిండు ప్రాణాలు బలవ్వడం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ అయ్యింది.   



మరింత సమాచారం తెలుసుకోండి: