బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ అప్పుడెప్పుడో శుద్ధ్ దేశీ రొమాన్స్, బే ఫిక్రే సినిమాలలో హాట్ గా, విచ్చలవిడిగా లిప్ లాక్స్ తో జనాలను కిర్రెక్కించింది. అంతేకాదు తన మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను దక్కించుకుంది. ఇక తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం లోను నటించింది. ఈ సినిమాలో నాని-వాణి ల లిప్ లాక్ పెద్ద దుమారమే లేపింది. ఇకా చాలా కాలంగా సక్సస్ కోసం ఎదురు చూసిన వాణీకి రీసెంట్ గా 'వార్' సినిమాతో దక్కింది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హృతిక్ -టైగర్ ష్రాఫ్ లు హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సస్ తో వాణి ఫుల్ జోష్ లో ఉంది.  వాణి మొదటి నుంచి బోల్డ్ కాబట్టి సోషల్ మీడియాను నచ్చినట్టు ఆడుకోవడం తనకు మామూలే. 

రీసెంట్ గా వాణి తన ఇన్స్టా గ్రాం అకౌంట్ ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు 'జీవితాన్ని మరీ సీరియస్ గా తీసుకోకండి.. ఎవరూ సజీవంగా ఈ లోకం నుంచి నిష్క్రమించలేరు' అంటూ ఒక మైండ్ బ్లాక్ అయ్యో క్యాప్షన్ ఇచ్చింది.  నిజమే కదా.. మనం ఎంత తహ తహలాడినా ప్రాణాలతో ఈ లోకం నుంచి బయటకు పోలేం. అయినా ఈ హాట్ బ్యూటీ ఇంత డీప్ గా ఇలా ఫిలాసఫీ ఎందుకు చెప్పిందో మరి. ఇక 'వార్' హిట్ తీసుకొచ్చిన ఉత్సాహం అంతా ఆ నవ్వులో కనిపిస్తోంది. ఎలాగూ హాట్ హీరోయిన్ కావడంతో అందాలు ధారపోస్తూనే.. ఇలాంటి డీప్ ఫిలాసఫీ చెబుతోంది. 

ఇక నెటిజన్స్ నుండి ఈ ఫోటోకు సూపర్ కామెంట్స్ వచ్చాయి. 'సూపర్ హాట్ బేబ్'.. 'గ్లామర్ వార్ ఎవరిపైన?'.. 'ఝకాస్ స్మైల్.. సూపర్ స్టైల్' అంటూ కామెంట్లు పెట్టారు. ఒక నెటిజన్ కు క్యాప్షన్ పెద్ద నచ్చినట్టు లేదు.. అందుకే ఆ రాగం ఏంటి ఈ తాళం ఏంటి అన్నట్టుగా 'క్యాప్షన్ కి.. ఫోటోకి సంబంధం ఏంటి?' అని ప్రశ్నించాడు. ఏదేమైనా ఒక్క హాట్ ఫొటోతో వాణి అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం 'షంషేరా' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో 
సంజయ్ దత్.. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: