ఇటీవల వెండితెరతో పాటు ఎంతో మంచి వీక్షకధారణతో బుల్లితెర ప్రోగ్రామ్స్ కూడా దూసుకుపోతున్నాయి. ఇక వాటిలో నటిస్తున్న నటీనటుల్లో తమ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న నటులు కొందరికి సినిమాల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. ఆ విధంగా కొన్నాళ్ల క్రితం ఈటివి ఛానల్ లో ప్రారంభం అయిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో పాపులైన వారిలో సుధీర్ మరియు రష్మీ కూడా ఉంటారు. మొదట మెజీషియన్ గా పనిచేసిన సుధీర్ ఆ తరువాత మెల్లగా జబర్దస్త్ షోలో ప్లేస్ సంపాదించి, ఆ తరువాత కొద్దిరోజులకు తనకంటూ ప్రత్యేకంగా గ్రూప్ ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాదు అనతి కాలంలో తన ఆకట్టుకునే నటనతో ఎందరో ఫ్యాన్స్ ని కూడా సుధీర్ సంపాదించుకోడవంతో పాటు ప్రస్తుతం సాఫ్ట్ వేర్ సుదీర్ అనే సినిమాలో హీరోగా కూడా యాక్ట్ చేస్తున్నాడు. 

ఇక తొలుత కొన్ని సినిమాలతో పాటు టివి షోల్లో యాంకర్ గా పనిచేసిన రష్మీకి అనుకోకుండా జబర్దస్త్ లో అవకాశం రావడం, ఆమె దానిని బాగా వినియోగించుకుని, తన ఆకట్టుకునే యాంకరింగ్ టాలెంట్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక ప్రస్తతం మంచి క్రేజ్ ఉన్న తెలుగు యాంకర్లలో రష్మీ కూడా ఒకరు అని చెప్పక తప్పదు. అయితే కొద్దిరోజుల క్రితం సుధీర్, రష్మీ కలిసి జబర్దస్త్ లోని ఒక స్కిట్ సందర్భంగా పెళ్లి చేసుకునే సీన్ లో నటించారు. ఇక అప్పటి నుండి వారిద్దరి మధ్య ఏదో ఉందని, అలానే వారిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు అప్పటినుండి ఇప్పటివరకు పుకారవుతూనే ఉన్నాయి. 

ఇక కొందరు జబర్థస్థ యాక్టర్లు ఇటీవల మాట్లాడుతూ, మేము ఎక్కడికి వెళ్లినా ముందుగా ఫ్యాన్స్ అడిగే ప్రశ్న సుధీర్ మరియు రష్మీల పెళ్లి గురించే అని చెప్పడం జరిగింది. వాస్తవానికి వారిద్దరి మధ్య అటువంటిది ఏమిలేదని, వారు కేవలం షోలో భాగంగానే ఆలా యాక్ట్ చేస్తారని, షో పూర్తి అయ్యాక ఎవరి లైఫ్ వారిదేనని అంటున్నారు. ఇక ఇటీవల ఈ విషయమై పుకార్లు మరింత వెల్లువెత్తడంతో, జబర్దస్త్ కమెడియన్ ఒకరు మాట్లాడుతూ, అవును మీరు అనుకున్నది నిజమే, సుధీర్ కు మరియు రష్మీకి పెళ్లి జరుగుతుంది. అయితే అది సుధీర్ కు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కుదిర్చిన అమ్మాయితో, అలానే రష్మీకి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కుదిర్చిన అబ్బాయితో అంటూ తమ అభిమానులు కొందరికి సరదాగా సమాధానం ఇచ్చారట. కాగా ఈ వార్త ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: