నందమూరి బాలక్రిష్ణకు తన తండ్రి ఎన్టీయార్ అంటే గురువు, దైవం అన్నిటికీ మించి అని చెబుతారు. తాను నటనను తండ్రి నుంచే నేర్చుకున్నానని, ఆయనే తన గురువు అని బాలయ్య ఎపుడూ చెబుతారు. తండ్రి ప్రస్తావన తేస్తే చాలు ఆయన అనందంతో ఊగిపోతారు. అంతలా ఆరాధించే తండ్రి పాత్రను బాలక్రిష్ణ బయోపిక్ గా తీసి తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. అయితే ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు.


ఇదిలా ఉంటే బాలయ్య మరోమారు తన తండ్రి పాత్రలో నటిస్తాడా అన్న చర్చ ఇపుడు జోరుగా సాగుతోందంట. ఎందుకంటే తమిళంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కధతో నిర్మిస్తున్న తలైవి  మూవీలో అన్న గారి వేషం ఉందట. అన్న గారు జయలలిత కలసి చేసిన సినిమాలు బోలెడు ఉన్నాయి. అలాగే ఇద్దరూ ఒక సమయంలో ముఖ్యమంత్రులుగా కూడా కొంతకాలం ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో పనిచేశారు. 


దాంతో జయలలిత సినీ రాజకీయ జీవితాల్లో ఎన్టీయార్ పాత్రను తక్కువ అంచనా వేయలేం. మరి తలైవి  మూవీలో కూడా అన్న గారి పాత్ర పోషించాలంటే అందుకు తగిన నటుడు బాలయ్యేనని నిర్ధారణకు చిత్ర యూనిట్ వచ్చిందట. పైగా ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి కూడా బాలయ్య చేస్తేనే ఎన్టీయార్ పాత్రకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారుట. సో మళ్ళీ అన్నగారి పాత్రలోకి బాలయ్య పరకాయ ప్రవేశం చేస్తారా అన్నది చూడాలి.


ఇదిలాఉండగా ఎన్టీయార్  మహానాయకుడు, కధానాయకుడు సినిమాలు బాలయ్య ఎంతో ఇష్టంగా చేశారు. అయితే ఆ సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి. బాలయ్య కెరీర్లోనే ఆ సినిమాలు దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకున్నాయి. ఈ నేపధ్యంలో బాలయ్య మళ్ళీ ఎన్టీయార్ గెటప్ కడతారా అన్నది చర్చగా  ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: