కోలీవుడ్ నటుడు కార్తీ ఇటీవల నటించిన ఖైదీ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితం అవుతుండడంతో సినిమా యూనిట్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక నేటితో ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో కూడా చేరడం జరిగింది. హీరోయిన్, సాంగ్స్, రొమాంటిక్, కామెడీ సీన్స్ వంటివి ఏమి లేకుండా, కేవలం కథ మరియు కథనాలే ప్రధాన బలంగా ఒక రాత్రి జరిగే కథగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. 

కార్తీ ఒక లారీ డ్రైవర్ గా నటించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఇకపోతే దీని తరువాత కార్తీ ప్రస్తుతం తన వదిన జ్యోతికతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో జ్యోతికకి తమ్ముడిగా కార్తీ నటిస్తున్నారు. తమిళం తో పాటు తెలుగు, మలయాళ భాషల్లో కూడా వచ్చే నెల క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు వర్షన్ కు కథ రీత్యా తమ్ముడు అనే టైటిల్ ని పెట్టాలని సినిమా యూనిట్ యోచిస్తోందట. ఆ టైటిల్ విషయమై తమ్ముడు సినిమా నిర్మాతలని కూడా ఈ మూవీ యూనిట్ కలిసి పర్మిషన్ తీసుకోనున్నల్టు టాక్. 

ఇప్పటికే అన్నయ్య మెగాస్టార్ సినిమా పేరైన ఖైదీని తన సినిమాకు టైటిల్ గా పెట్టుకుని భారీ హిట్ కొట్టిన  కార్తీ, ప్రస్తుతం తమ్ముడు పవర్ స్టార్ సినిమా పేరు పెట్టుకుని మరొక హిట్ కొట్టడం ఖాయం అని కార్తీ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే సినిమాలో కథ రీత్యా కూడా తమ్ముడు అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావించి సినిమా యూనిట్ కూడా ఈ టైటిల్ కె ఓటేసినట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఖైదీ సక్సెస్ తో మంచి జోరు మీదున్న కార్తీ, త్వరలో రిలీజ్ కాబోయే ఈ తమ్ముడు సినిమాతో ఎంతమేర సక్సెస్ అందుకుంటారో చూడాలి. అయితే ఈ సినిమా టైటిల్ విషయమై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: