బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రెస్టిజియస్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. సినిమాలో తారక్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు.   


నిజ జీవితంలో స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడిన ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో కల్పిత కథతో ఆర్.ఆర్.ఆర్ సినిమా తెరకెక్కుతుంది. కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ అదరగొట్టడం ఖాయమని తెలుస్తుండగా తారక్ కన్నా సినిమాలో అల్లూరి పాత్రలో నటిస్తున్న రాం చరణ్ కు ఎక్కువ స్కోప్ దొరుకుతుందట.    


సినిమాలో రాం చరణ్ సత్తా చాటడం ఖాయమని తెలుస్తుంది రంగస్థలంలో చిట్టిబాబుగా చితక్కొట్టిన రాం చరణ్ తప్పకుండా అల్లూరిగా అదరగొట్టడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఈ ఇద్దరి ప్రెజెన్స్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని తెలుస్తుంది.    


కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ ఇద్దరు మొదటిసారి కలిసే సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. అంతేకాదు ఇంటర్వల్ సీన్ లో ఇద్దరు కలిసి చేసే ఫైట్ సీన్ మెగా నందమూరి ఫ్యాన్స్ ను ఎవరిని సీట్లలో కూర్చోనివ్వదని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ అంచనాలకు తగినట్టుగానే రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. తప్పకుండా ఈ సినిమా మరో బాహుబలి కాదు అంతకుమించిన రికార్డులను క్రియేట్ చేస్తుందని అంటున్నారు. సినిమాలో ఇద్దరు హీరోలు ఉండగా ఆ ఫ్యాన్స్ హర్ట్ అవకుండా ఇద్దరి పాత్రలను సమంగా తీర్చిదిద్దుతున్నాడట రాజమౌళి. 2020 జూలై 30న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే అనుకున్న టైంకు ఈ సినిమా రిలీజ్ అవూందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.     




మరింత సమాచారం తెలుసుకోండి: