జగన్ కి టాలీవుడ్లో మద్దతు పెద్దగా ఉండదన్నది తెలిసిందే. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ పార్టీని పెట్టి జగన్ని గట్టిగా అటాక్ చేస్తున్నారు. దానికి తోడు తెలుగు  ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీదే అధిపత్యం. అందువల్ల జగన్ కి సపోర్ట్ చేసి అనవసరంగా గొడవ తెచ్చుకోవడం ఎందుకన్న ఆలోచనే సినీ నటుల్లో  చాలా మందికి ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం తమ సొంత అభిప్రాయాలను ఎప్పటికపుడు నిర్భయంగా చెప్పేస్తూ ఉంటారు.


వారిలో ముందు వరసలో ఉంటారు డాక్టర్ రాజశేఖర్. ఆయన ఎన్నో హిట్లు టాలీవుడ్లో కొట్టారు. రాజకీయాల్లో కూడా నాటి అన్న గారి నుంచి నేటి జగన్ వరకూ అందరి ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఒకసారి వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన జీవితా రాజశేఖర్ దంపతులు తరువాత కాలంలో మళ్ళీ వచ్చి చేరారు. ఎన్నికల ముందు వారి చేరడమే కాదు, వైసీపీ విజయానికి ప్రచారం కూడా చేరారు.


ఆ తరువాత రాజశేఖర్ సినిమాలు చేసుకుంటున్నారు. ఇక ఏపీలోని పాఠశాలల్లో  ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం పైన పెద్ద దుమారమే   చెలరేగుతోంది. దీని మీద సినీ నటుడుగా కూడా ఉన్న పవన్ జగన్ మీద విమర్శలు జోరు పెంచేశారు. అది వివాదమై కూర్చున్న నేపధ్యంలో సినీ ప్రముఖుడుగా రాజశేఖర్ జగన్ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. పేదలకు కూడా ఆంగ్లం నేర్పుతామంటే తప్పేంది, ప్రతీ వారు పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలి. అందువల్ల జగన్ నిర్ణయం కరెక్ట్ అంటూ రాజశేఖర్ కుండబద్దలు కొట్టారు. మరి ఈ విషయంలో మిగిలిన  వారి సంగతి ఎలా ఉన్నా రాజశేఖర్ మాత్రం జగన్ కి అండగా నిలవడం విశేషమే. మొత్తానికి జగన్ పాలన పట్ల టాలీవుడ్లో స్పందన బాగానే వచ్చింది.




మరింత సమాచారం తెలుసుకోండి: