టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ తో పోలిస్తే ముంబై పరిశ్రమలో హీరోయిన్స్ మధ్య  పోటి ఎంత హెవీగా ఉంటుందో తెలిసిందే. ఈ కాంపిటీషన్ లో అందాల ఆరబోతకు, లిప్ లాక్స్ కు ఏ ఒక్కరు అడ్డు చెప్పరు. దానికి తోడు ఈ మధ్య కాలంలో స్టార్ వారసురాళ్ళ తో పాటు డెబ్యూ హీరోయిన్స్ ల రాక కూడా బాగా ఎక్కువైంది. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ చాలా ఠఫ్ గా కనిపిస్తోంది. అందుకే అందగత్తెలంతా స్టైల్ & ఫ్యాషన్స్ పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.  

అలాంటి చోట కెరీర్ కోసం గత మూడేళ్లుగా రకుల్ ఎన్ని ప్రయత్నాలు తెలిసిందే. బాలీవుడ్ లో ముందుగా 'మన్మార్జియాన్' అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇక రీసెంట్‌గా అజయ్ దేవగన్ సరసన 'దేదే ప్యార్ దే' అనే హిట్ సినిమాలో నటించింది. ఈ హిట్ తో కాస్త క్రేజ్ వచ్చిన రకుల్ అప్పటి నుంచి పూర్తిగా బాలీవుడ్ లో సెటిలయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'మర్జావాన్' రిలీజ్ కి రెడీ అవుతోంది. మాస్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రకుల్ నటించింది. ఈ సినిమాలో రకుల్ తో పాటు తారా సుతారియా కూడా మరో హీరోయిన గా నటిస్తోంది. సిద్ధార్థ్ తో ముక్కోణపు ప్రేమకథలో విరహవేదన అనుభవించే ప్రేమికురాలిగా రకుల్ కనిపించబోతోందని బాలీవుడ్ మీడియా సమాచారం. 

ఈ సందర్భంగా మర్జవాన్ ప్రమోషన్స్ లో భాగంగా రకుల్ మీడియా ఇంటరాక్షన్స్ తో బిజీబిజీగా ఉంటోంది. మరోవైపు ఆన్ లొకేషన్ లో కూడా రకుల్ మర్జవాన్ ప్రచారంతో హీటెక్కిస్తోంది. ఇక 'మర్జవాన్' రొమాంటిక్ యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కింది మిలాప్ జావేరి దర్శకత్వం వహించగా.. రితీష్ దేశ్ ముఖ్ ఓ ప్రధాన పాత్రల్లో నటించాడు. ఈ సినిమాతో పాటు ఎస్.కే 14 లో శివకార్తికేయన్ సరసన నటిస్తున్న రకుల్..శంకర్ తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఇండియన్ 2' లోను నటిస్తోంది. ఇందులో కమల్ హాసన్- కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: