ఈ రోజే విడుద‌లైన ఓ సినిమా పోస్ట‌ర్‌కు వైఫ్‌, ఐ అని ఆంగ్లంలో టైటిల్ పెట్టడం దానికి క్యాప్ష‌న్ కూడా ఇల్లీగ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ అని ఉండ‌టం ఆశ‌క్తి రేకెత్తించింది. అస‌లు వైఫ‌, ఐ అంటే నేను నా భార్య అని తెలుగులో అర్ధం. కానీ పోస్ట‌ర్ లుక్ మాత్రం చాలా ఘాటుగా ఉంది. దానికి తోడు ఇద్ద‌రికీ పై భాగంలో వ‌స్త్ర‌ధార‌ణ లేకుండా తీసిన పోస్ట‌ర్ యువ‌త‌ను ఆక‌ట్టుకునేందుకు అన్న‌ట్లు ఉంది. దానికి తోడు ఇల్లీగ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ అనే క్యాపష‌న్‌తో కూడిన ఈ పోస్ట‌ర్ దానికి త‌గిన‌ట్టుగా హీరో హీరోయిన్ రొమాన్స్ చేసుకునే స‌న్నివేశాన్ని క‌ట్ చేసి పోస్ట‌ర్‌గా రూపొందించారు. గ‌తంలో కూడా ఇలాంటి సినిమాలు దానికి సంబంధించిన పోస్ట‌ర్లు విడుద‌ల‌య్యాయి.  దీనికి తాజా ఉదాహ‌ర‌ణ ఇటీవ‌లె విడుద‌ల ఏడు చాప‌ల క‌థ అందులోనూ యువ‌తను మ‌రింత ఆక‌ర్షిణతో పాటు ఉద్రేక‌ప‌రిచే విధంగా  పోస్ట‌రును ట్రైల‌ర్‌ను రూపొందించారు. ట్రైల‌ర్‌లో  మ‌సాలాను కాస్త ఎక్కువ మోతాదులో జోడించి ఇది ఒక బూతు చిత్రం అన్న త‌ర‌హాలో డైరెక్ట్‌గానే చూపించారు. ఇటీవ‌ల కాలంలో ఈ త‌ర‌హా చిత్రాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ ఎవ‌ర్ని టార్గెట్ చేసి ఈ సినిమాలు ద‌ర్శ‌కులు తీస్తున్నారు అన్న‌ది ప్రేక్ష‌కుల‌కు ఇట్టే తెలిసిపోతుంది.  


ఇటువంటి చిత్రాల‌తో ఎవ‌ర్ని ఎడ్యుకేట్ చెయ్యాల‌నుకుంటున్నారు. స‌భ్య‌స‌మాజానికి ఏం మెసేజ్ ఇవ్వాల‌నుకుంటున్నారు అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇలాంటి సినిమాలు రావ‌డానికి కార‌ణం ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న పోక‌డ‌లే . చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా వ‌స్తున్న సినిమాల్లో హీరోయిన్లే వ్యాంపు క్యారెక్ట‌ర్ త‌ర‌హాలో ఎక్స్‌పోజింగ్ చెయ్య‌డం. హీరోలు ద్వందార్ధాల సంభాష‌ణ‌ల‌తో వాళ్ళ‌ని కామెంట్ చెయ్య‌డం లాంటివి జ‌ర‌గ‌డంతో చిన్న చిత్రాల‌ను నిర్మించేవాళ్ళు మ‌రో అడుగు ముందుకు వేస్తున్నార‌ని సినీ వీశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా సినిమా నిర్మాణంలో స‌రైన నియ‌మ‌నిబంధ‌న‌లు లేక‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణం. దీనికి స‌రైన మార్గద‌ర్శ‌కాల‌ను ఇవ్వ‌డంలో ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌, నిర్మాతల‌ మండ‌లి ప్ర‌ధాన లోపంగా క‌నిపిస్తున్నాయి .


ఈ విష‌య‌మై ప‌లు సార్లు ప‌లువురు ఛాంబ‌ర్ దృష్టికి తీసుకొచ్చినా ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. అదేమిటంటే సినిమాల నిర్మాణం అయ్యాక సెన్సార్‌బోర్డ్ నుండి అభ్య‌త‌రం రాక‌పోవ‌డం , కొన్నిసార్లు సెన్సార్ స‌భ్యుల‌ను మేనేజ్ చెయ్య‌డం వంటివి జ‌ర‌గ‌డంతో ఇలాంటి సినిమాలు ఎక్కువ‌య్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: