సినిమాలే కాదు ఈమధ్య సోషల్
మీడియా పుణ్యమాని వెబ్ సీరీస్ లకు మంచి డిమాండ్ పెరిగింది. అమేజాన్, నెట్ ఫ్లిక్స్ పోటీ పడి మరి వెబ్ సీరీస్ లను నిర్మిస్తున్నాయి. దాదాపు
సినిమా స్టాండర్డ్స్ తో ఈ వెబ్ సీరీస్ లు వస్తున్నాయని చెప్పొచ్చు. అయితే
బాలీవుడ్ లో నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో వచ్చిన లస్ట్ స్టోరీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
ఆ వెబ్ సీరీస్ తర్వాత కియరా అద్వానికి బీ టౌన్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది. కొన్ని సీన్స్ లో అమ్మడి ఎక్స్ ప్రెషన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హిందిలో వరుస
సినిమా ఛాన్సులు అందుకుంటున్న కియరా తెలుగులో కూడా
సూపర్ స్టార్ మహేష్ తో
భరత్ అనే నేను
సినిమా చేయగా ఆ తర్వాత మెగా
పవర్ స్టార్ రాం
చరణ్ తో జతకట్టింది.
ఇక నెట్ ఫ్లిక్స్ లస్ట్ స్టోరీ విషయానికి వస్తే ఆ వెబ్ సీరీస్ హిందిలో
సక్సెస్ అవడంతో దాన్ని తెలుగులో కూడా
రీమేక్ చేస్తున్నారు. ఈ తెలుగు లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ లో తెలుగమ్మాయి
ఈషా రెబ్బ నటిస్తుందట. లస్ట్ స్టోరీస్ లో నటించాలంటే ఇదివరకు ఉన్న ఇమేజ్ ను తుడిచిపెట్టి కొత్త ఇమేజ్ ఏర్పాటు చేసుకోవాలి. తెలుగు
హీరోయిన్ ఈషా రెబ్బ ఈ వెబ్ సీరీస్ లో నటిస్తుంది.
ఇప్పటి వరకు సినిమాల్లోనే గ్లామర్ షో చేయని
ఈషా రెబ్బ ఒకేసారి ఇలాంటి వెబ్ సీరీస్ కు ఓకే చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మడికట్టుకు కూర్చుంటే అవకాశాలు రావని గుర్తించిన
ఈషా రెబ్బ తనలోని అసలు టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతుంది. ఈమధ్య ఫోటో షూట్స్ తో గ్లామర్ షో చేస్తున్న
ఈషా తప్పకుండా ఈ వెబ్ సీరీస్ తో ఓ రేంజ్ కు వెళ్తుందని అంటున్నారు.