పూజా హెగ్డే..
కన్నడ కస్తూరి. అందాల రాశి. నటనలో కూడా మంచి మార్కులే వేసుకుంటున్న ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్లో టాప్ ర్యాంక్ సాధించింది.
పూజా కావాలి అంటూ స్టార్లు ఒక్క లెక్కన క్యూ కడుతున్నారు.
పూజా ఒక్క సాంగ్ చేసిపో అంటున్నారు నిర్మాతలు. ఆమె ఉంటే చాలు ఆ
సినిమా క్రేజే వేరు అన్నంతగా
పూజా ఇమేజ్ బిల్డప్ అయింది.
ఇదే చాన్స్ అని
పూజా వరసగా స్టార్ హీరోలకు క్లాస్ తీసుకుంటోందట. అదేంటి మన సినిమాలో హీరోలు అంత చాన్స్ ఇస్తారా అంటే ఇస్తున్నారు అనే పూజ చెబుతోంది. ఈ క్లాస్ తీసుకునే కధ అంతా
జూనియర్ ఎన్టీయార్ మూవీతోనే మొదలుపెట్టిందట. అరవింద సమేత మూవీలో ఎన్టీయార్ కి క్లాస్ తీసుకోవడంతో పూజ ఈ ట్రెండ్ మొదలుపెట్టింది. హీరోకు ధైర్యం నూరిపోయడం, విలన్ ఎదురుగా ఉన్న వేళ సరైన సమయంలో నీకు తిరుగులేదు, నీవు తలచుకుంటే నీ కంటే పెద్ద తోపు ఎవరూ లేరంటూ భారీ డైలాగులతో రెచ్చగొట్టడం వంటివి
పూజా మార్క్ క్లాసులన్నమాట.
ఆ తరువాత
మహర్షి సినిమాలో ఏకంగా
సూపర్ స్టార్ మహేష్ బాబుకే క్లాస్ తీసుకుంది ఈ అమ్మడు. అది బాగా కలసి వచ్చి ఆ
మూవీ బిగ్
సక్సెస్ అయింది. ఇక ఇదే బాగుందని అల వైకుంఠపురంలో ఏకంగా బన్నీకి కూడా పూజాతో క్లాసులు పెట్టించేశాడట
డైరెక్టర్ త్రివిక్రం. మరి
పూజా క్లాసులు హీరోలకు తీసుకున్నా
ఆడియన్స్ బుద్ధిగా హాల్లోకి వచ్చి సైలెంట్ గా అంతా వింటారట. అంత అందంగా క్లాస్ తీసుకునే పంతులమ్మ కనుకనే
టాలీవుడ్ పూజాకు కనకాభిషేకం చేస్తోంది. మొత్తానికి
పూజా చేత క్లాసులు చెప్పించుకోవడానికి
ప్రభాస్ తో పాటు ఎంతో మంది స్టార్ హీరోలు క్యూలో ఉన్నారో మరి.