జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సమావేశంలో ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలంగా మారాయి. సీఎం మితిమీరిన మాటలు దేశాన్ని బ్రష్టు పట్టించేలా ఉందని పవన్ అన్నారు. యదా నాయక తదా నేత అన్నట్లు ఇక్కడ జరుగుతుంది. ఆయన చెడిపోవడమే కాదు, 150 మంది నాయకులను కూడా చెడగొట్టుతున్నావ్ అని పవన్ అన్నారు. 
 

ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్, పవన్ కళ్యాణ్ ల మధ్య విమర్శల చర్చ జరుగుతున్న సంగతి తేలింసిందే. జగన్ పవన్ ను మూడు పెళ్లిళ్లు చేసున్నావని, నలుగురు పిల్లల్ని కన్నవాని జగన్ చేసిన వ్యాఖ్యలు చేసాడు. ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ మాట్లాడుతూ ... నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని తాజా పరిణామాలపై స్పందించారు. పెళ్లిళ్లు, రాజకీయాలు, ప్రజాసేవ తదితర అంశాలను ఎవరైనా మనసుకు నచ్చినట్టు చేస్తారని అన్నారు. పవన్ కు పెళ్లిళ్ల మీద మక్కువ ఉంటే, సీఎం జగన్ కు ప్రజాసేవపై మక్కువ ఉందని తెలిపారు.అందుకే జగన్ సీఎం అయ్యాడు అంటూ నాని అన్నారు. సినిమాలు  చెయ్యడం రొమాన్స్ చేయడం కాదు, జనాలను మంచిగా చూసుకోవాలి. 


సీఎం జగన్ ఎప్పుడూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, వెంకయ్యనాయుడు గురించి గతంలో చేసిన విమర్శలను పవన్ గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని సీఎం జగన్ ను ఎంతోమంది యువత కోరారని, పాదయాత్ర సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు జగన్ కు సూచనలు చేశారని పేర్ని నాని వెల్లడించారు. అందరు అనుకున్న  విదంగానే ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం చదువును కూడా ప్రవేశపెడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: