‘బిగ్ బాస్ 3’ విజేతగా రాహుల్ వచ్చినా అతడితో సమానంగా మీడియా వరుణ్ సందేశ్ వితిక లతో కూడ ఇంటర్వ్యూలు చేస్తూ వీరిద్దరి క్రేజ్ ను కొనసాగించడానికి తమవంతు సహకారం ఇస్తోంది. ‘బిగ్ బాస్’ షోలోకి ప్రవేసించే ముందు వరుణ్ సందేశ్ పేరు చాలామందికి తెలిసినా వితిక పేరు మాత్రం చాలామందికి ఈషో ద్వారా మాత్రమే తెలిసి వీరిద్దరికీ సెలెబ్రెటీ జంట హోదా వచ్చేలా చేసింది. 

ఇలాంటి పరిస్థితులలో కొన్ని మీడియం రేంజ్ కంపెనీలు వితిక వరుణ్ సందేశ్ ల క్రేజ్ ను తమ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కు వాడుకోవాలి అన్న ఉద్దేశ్యంతో ఈమధ్య కొన్ని కంపెనీలు తాము బుల్లితెర పై ప్రసారం చేసే తమ ప్రొడక్ట్స్ యాడ్ లో నటించమని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈయాడ్స్ లో నటించడానికి వరుణ్ తేజ్ వితికలు అడిగిన భారీ పారితోషికం విషయాన్ని తెలుసుకుని ఆకంపెనీలు రివర్స్ గేర్ లో వెళ్ళిపోయాయి అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి. 

వాస్తవానికి ప్రస్తుతం చాల కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ను కన్జ్యూమర్స్ దృష్టిని ఆకర్షించి తమ సేల్స్ పెంచుకోవడానికి సెలెబ్రెటీ కపుల్స్ చేత యాడ్స్ చేయిస్తున్నారు. ముఖ్యంగా టాప్ హీరో సూర్య జ్యోతిక స్నేహ ప్రసన్న నగాచైతన్య సమంత ఇలా కొంతమంది సెలెబ్రెటీ కపుల్స్ జంటగా యాడ్స్ చేసి భారీ మొత్తాలలో గణిస్తున్నారు. 

ఇలాంటి అవకాశం చాల తక్కువమందికి మాత్రమే వస్తుంది. ‘బిగ్ బాస్ 3’ ఇచ్చిన క్రేజ్ తో ఇప్పుడు కొన్ని కంపెనీలు వరుణ్ వితిక లతో యాడ్స్ చేయాలని ప్రయత్నిస్తుంటే వారు వారికి వచ్చే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం లేదు అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. స్టార్ కపుల్ హోదా వచ్చినంత మాత్రాన ఈఇద్దరికీ నాగచైతన్య సమంత లకు ఇచ్చే స్థాయిలో ప్రకటనలకు సంబంధించి పారితోషికాలు ఇవ్వరు అన్న విషయాన్ని వీరు గ్రహిస్తే ‘బిగ్ బాస్ 3’ పూర్తిగా తగ్గిపోయేలోగ వీరిద్దరికీ మంచి సంపాదన సంపాదించుకునే అవకాశాలు వస్తాయి అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు..  
.



మరింత సమాచారం తెలుసుకోండి: