తెలుగు వాడు అయినా కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిన విశాల్... అటు తమిళ్‌తో పాటు ఇటు తెలుగులోనూ తన సినిమాలతో హిట్లు కొడుతున్నాడు.
విశాల్ నటించిన తెలుగు సినిమాలు రాయుడు, అభిమన్యుడు, డిటెక్టివ్, పందెం కోడి 2 లాంటి సినిమాలతో వరుసగా హిట్లు కొడుతున్నాడు. తాజాగా
విశాల్ నటించిన యాక్షన్
థ్రిల్లర్ మూవీ ‘యాక్షన్’.
మిల్కీబ్యూటీ
తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి
సుందర్ సి దర్శకత్వం వహించారు.
విశాల్ కెరీర్లో మొదటి సారి సుమారు రు. 55 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఈ
సినిమా బడ్జెట్ లానే ‘యాక్షన్’ ప్రీ రిలీజ్
బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. ఏరియాల వారీగా యాక్షన్ ప్రి రిలీజ్
బిజినెస్ ఇలా ఉంది.
యాక్షన్ ప్రీ రిలీజ్
బిజినెస్ (రూ.కోట్లలో) :
ఆంధ్ర –
తెలంగాణ – 7.2 (టాక్స్ అండ్ పబ్లిసిటీ కలుపుకొని)
తమిళనాడు (తమిళ్ వెర్షన్) – 17.4
ఇండియా అండ్ వరల్డ్ వైడ్ – 04.2
---------------------------------------------------------
----------------------------------------------------------
ఇక తెలుగు
విశాల్ మార్కెట్ విషయానికి వస్తే అభిమన్యుడు సినిమాని 4.5 కోట్లకు కొంటే అది లాంగ్ రన్లో రు 9.2 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత పందెం కోడి 2 రు.10 కోట్లకు కొంటే అది రు 7.5 కోట్లు రాబట్టింది. ఇక యాక్షన్
సినిమా తెలుగు వరకు రు 7.2 కోట్ల ప్రి రిలీజ్
బిజినెస్ జరిగింది. ఇప్పటికే ట్రైలర్ బాగా నచ్చడంతో సినిమాపై అంచనాలు బాగున్నాయి.
చాలా రోజుల నుంచి
బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కమర్షియల్
సినిమా లేకపోవడం కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవ్వనుంది. సో
సినిమా బాగుంటే యాక్షన్
సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చి పెడుతుందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.