తెలుగు లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  అలాంటివారిలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న నటుడు డాక్టర్ రాజశేఖర్ విలన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోగా మారారు.  ఆ తర్వాత ఎన్నో యాక్షన్ భరిత సినిమాలు చేశారు.  అయితే తలంబ్రాలు, అంకుశం, ఆహుతి లాంటి సినిమాల్లో తన తో నటించిన జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.


ఈ ఇద్దరు కలిసి తర్వాత నటించిన సినిమాలు తక్కువే అయినా ఇండస్ట్రీలో ఈ జంటకు మంచి పేరు ఉంది.  ఆ మద్య జీవిత దర్శకురాలిగా మారారి..ఒకటీ రెండు సినిమాలు కూడా తీశారు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల శివాత్మిక ‘దొరసాని’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  ఇక చాలా కాలం తర్వాత రాజశేఖర్ ‘గరుడవేగ’ మూవీతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు.  


మూవీ అందరూ ఊహించినదానికన్న ఎక్కువే సక్సెస్ అయ్యింది.  దాంతో యాంగ్రీ యంగ్ మాన్ ఈజ్ బ్యాక్ అన్నారు. ఇక రాజశేఖర్ కి అచ్చొచ్చిన పోలీస్ నేపథ్యంతో ఉన్న మరో మూవీ ‘కల్కి’ సైతం మంచి విజయం సాధించింది. తాజాగా హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘోర ప్రమాదానికి గురైంది. పెద్ద గోల్కొండ సమీపంలో కారు బోల్తా పడింది.

సేఫ్టీ ఫీచర్స్ అధికంగా ఉన్న లగ్జరీ కారు కావడంతో, వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నాయి. శంషాబాద్ సమీపంలో అవుటర్ రింగ్ రోడ్ పై కారు వేగంగా వెళుతున్న వేళ అదుపుతప్పినట్టు సమాచారం. రాజశేఖర్ స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: