అసలు సినిమాకు కథే హీరో అని చాలా చిత్రాలు ఇప్పటికే నిరూపించాయి. ఆ కథకు తగ్గట్టు నటీనటుల నటన, దర్శకత్వం తోడైతే ఎలాంటి సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మరోసారి రుజువైంది. విడుదలకు ముందే ‘నో రోమాన్స్, నో హీరోయిన్, ఓన్లీ యాక్షన్‌ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా గురించి కార్తీ ముందుగానే ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చాడు కథా నాయకుడు కార్తి.


ఖాకీ తరువాత కార్తి నటించిన వైవిధ్యమైన యాక్షన్‌ చిత్రం ఇది. పది సంవత్సరాలు శిక్ష అనుభవించి విడుదలైన ఒక ఖైదీ తన కూతురిని కలుసుకోవటానికి బయలుదేరుతాడు. కానీ అనుకోకుండా పోలీస్‌ అధికారులకు అతని సహాయం అవసరం అవుతుంది. అతను చేసే సహాయంపై పోలీస్‌ అధికారుల ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. ఆ రాత్రి ఈ ఖైదీ వాళ్లని ఎలా కాపాడాడు, తన కూతురిని ఎలా కలుసుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ.


కేవలం స్టోరీని నమ్మి కార్తీ ఈ సినిమా చేశాడు.. అది ఓ సాహసమే అనుకోవాలి. దీపావళి కానుకగా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఒకేసారి విడుదలైంది. విడుదలకు ముందు వరకు ఇటువంటి ఉత్కంఠభరితమైన యాక్షన్‌ చిత్రాన్ని ప్రేక్షకులు స్వీకరిస్తారో అని భయపడ్డాడట కార్తీ. కానీ.. ఇప్పుడు ఇది కార్తి సినీ జీవితంలో 100 కోట్లు గ్రాస్‌ వసూళ్లు చేసిన మొదటి సినిమాగా నిలిచింది.


గతంలోనూ కార్తీ ఇలాంటి ప్రయోగాలు చాలా చేశాడు. కొన్ని విజయవంతం అయ్యాయి. మరికొన్ని విఫలమయ్యాయి. కానీ ఖాకీ సినిమాతో కార్తీకి ఇలాంటి కథలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్న ధైర్యం ఇచ్చింది. ఆ సినిమా కూడా ఉత్కంఠ భరితంగా సాగే క్రైమ్ నేపథ్యం ఉన్న కథే. ఖైదీ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి వైవిధ్యభరితమైన కథలతో ఆకట్టుకుంటున్న కార్తీ..అందుకు తగ్గ ప్రతిఫలం కూడా వసూళ్ల రూపంలో పోందాడన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: