ప్రముఖ తెలుగు నటుడు డాక్టర్ రాజశేఖర్ కారు ప్రమాదానికి లోను అయినట్లుగా న్యూస్ వైరల్ ఒకటి అవుతోంది. ఆయన విజయవాడ నుంచి హైదరాబద్ వస్తూండగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ లోని ఔటర్ రింగు రోడ్డు వద్ద కారు టైరు పేలిపోవడంతో ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.


కారు టైర్లు ఒక్కసారిగా పగిలిపోవడంతో  కారు డివడర్ ని ఢీని పల్టీలు కొట్టినట్లుగా కూడా చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బాగ్స్ తెరచుకోవడంతో రాజశేఖర్ స్వల్పగాయాలతో బయటపడ్డారని అంటున్నారు. ఓ విధంగా కారులోని ఎయిర్ బ్యాగ్స్.. సీటు బెల్ట్ పెట్టు కోవటం  కారణంగానే పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఇదిలా ఉండగా రెండేళ్ళ క్రితం కూడా డాక్టర్ రాజశేఖర్ కారు ప్రమాదానికి గురి అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో అవుటర్ రింగ్ రోడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే తాజా ప్రమాదంలో రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడడంతో పాటు వేరే కారులో వెళ్ళిపోయినట్లుగా చెబుతున్నారు. 


ఇదిలా ఉండగా తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నాట్లుగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా రాత్రి పూట ప్రయాణాల వల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో వేగం కూడా ప్రమాదాలకు దారితీస్తుందని అంటున్నారు. మరి ఈ విషయంలో ఎవరి మటుకు వారే తగిన జాగ్రత్తలు పాటించడంతో పాటు, సెలిబ్రిటీలు అయితే అవగాహన సామాన్య ప్రజల్లో కల్పించాల్సిన  అవసరం కూడా  ఉందని అంటున్నారు.  గతంలో కూడా సినీ ప్రముఖులు, సెలిబ్రిటీల వారసులు అధిక వేగంతో దూకుడుగా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగిన సంగతిని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇక ప్రయాణించే వాహనాల కండిషన్ కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిఉంటుందన్న సంగతిని రాజశేఖర్ కారు టైర్ పేలిన ఘటన గుర్తుచేస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: