హింది సీరియల్స్ లో బాగా పాపులర్ అయిన నటి శ్వేత తివారి. సీరియల్స్ చేస్తూ కెరియర్ వెళ్లదీస్తున్న ఈమె మొదటి భర్త రాజా చౌదరితో అభిప్రాయ బేధాలు రావడంతో అతని నుండి విడాకులు తీసుకుంది. విడిపోయింది. 2013లో మళ్లీ శ్వేతా తివారి.. అభినవ్ కొహ్లిని రెండో పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు అతనికి కూడా గుడ్ బై చెప్పేసిందట శ్వేత.      


ఆరేళ్ల వీరి ప్రయాణంలో ఈమధ్య అభినవ్ కొహ్లిలో కొన్ని మార్పులు ఆమెను ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందట. సీరియల్స్ తో ఆమె బిజీగా ఉండటం వల్ల అభినవ్ కొహ్లి తన గాళ్ ఫ్రెండ్ తో జాలీగా తిరుగుతున్నాడని ఆమెకు తెలిసింది. అయితే అది నిజమే అని తెలిసిన తర్వాతనే అతని నుండి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యింది. 


రెండో పెళ్లిలో కూడా శ్వేతాకి సమస్యలా అంటూ మీడియా ఎలాంటి వార్తలు రాసినా తను అసలు పట్టించుకోనని అంటుంది శ్వేత తివారి. తాను కేవలం తన పిల్లల కోసం ఇలా చేయాల్సి వస్తుందట. మీడియా వార్తలకో మరెవరికో తాను భయపడనని కేవలం తన పిల్లల గురించే భయపడుతున్నానని ఆమె అన్నారు.


సీరియల్ స్టార్స్ పెళ్లిళ్లు విషయంలో ఇలా జరగడం ఇదేం కొత్త కాదు. తనకు సినిమా వాళ్ల అందరి జాతకాలు తెలుసని.. ఇంట్లో భార్యలను పెట్టుకుని వారు గాళ్ ఫ్రెండ్స్ తో జాలీగా తిరుగుతారని.. తన జోలికి ఎవరు వచ్చినా అంత తేలికగా వదిలిపెట్టనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది శ్వేతా తివారి. అయితే ప్రస్తుతం తన పిల్లల సమ్రక్షణే తన ధ్యేయమని వారిని సంతోషంగా చూసుకుంటానని చెబుతుంది శ్వేత. అంతేకాదు వివాహాల వల్ల బాధపడే మహిళల కోసం ఒక వేదిక ఏర్పాటు చేసి తాను దాని కోసం పనిచేస్తానని చెబుతుంది శ్వేత. వైవాహిక జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ వేదికలో చర్చిస్తామని అంటున్నారు శ్వేత.   



మరింత సమాచారం తెలుసుకోండి: