తెలుగు చలనచిత్ర హీరో రాజశేఖర్ ఈ రోజు అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దాదాపు 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో విజయవాడ నుండి హైదరాబాదు కి జాతీయ రహదారిపై వస్తున్న రాజశేఖర్ కారు అదుపుతప్పి శంషాబాద్ సమీపంలోని అవుటర్ రింగ్ రోడ్డు వద్ద అవతలి రోడ్డు పైకి దూసుకెళ్లింది. అతని కారు చాలా లగ్జరీది కావడంతో సేఫ్టీ ఫీచర్స్ అధికంగా ఉండడం వల్ల వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుని అతని ప్రాణాలను కాపాడాయి. గాయాలతో బయటపడ్డ రాజశేఖర్ ప్రస్తుత పరిస్థితి గురించి ఎలాంటి కచ్చితమైన సమాచారం లేకపోయినా అతని ప్రాణాలకు ప్రమాదం లేదని తెలిసింది.

ఇప్పటికే రెండుసార్లు కారు అదుపుతప్పి రెండుసార్లు వేరే వాహనాన్ని ఢీకొన్న రాజశేఖర్ కారు పైన ఇప్పటికే మూడు ఓవర్ స్పీడ్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. అయితే రాత్రి జరిగిన ప్రమాదానికి మాత్రం కారణం అధిక వేగమో లేదా మంచు కాదు. రాజశేఖర్ హైవే మీద మద్యం తాగుతూ కారుని నడిపినట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రంగా ధ్వంసం అయిన అతని కారులో రెండు మద్యం సీసాలను పోలీసులు సీల్ చేశారు.

అయితే కారులో మద్యం సీసాలు దొరికినంత మాత్రాన అతను తాగి బండి నడుపుతున్నట్లా అని మీకు అనుమానం రావచ్చు. అదే కారులో ఒక ఓపెన్ గ్లాస్ కూడా దొరికింది. అందులో
ఇంకా మద్యం ఉండడంతో పోలీసులు రాజశేఖర్ మద్యం మత్తులో అధిక వేగంతో డివైడర్ ను ఢీకొనడం కారు బోల్తా కొట్టించినట్లు నిర్ధారించారు. సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెచ్చుకోవడంతో ప్రాణాలతో బయటపడిన రాజశేఖర్ ఎంత వేగంతో తన కారుని నడిపే వాడు అన్నది బండి ప్రస్తుత పరిస్థితిని ఇంకా డివైడర్ మీద ఉన్న చెట్లు ధ్వంసం అయిన తీరును చూసి చెప్పవచ్చు.

మద్యం మత్తులో 180కిమీ వేగంతో కారుని నడిపిన రాజ శేఖర్ ప్రస్తుతం తన ఇంటిలోనే ప్రైవేటు డాక్టర్ తో చికిత్స అందుకుంటున్నాడు. హాస్పిటల్ కి వెళితే అతని రక్తంలో మద్యం ఉన్నట్లు బయటపడి పోలీసు కేసును ఎదురుకోవలసి వస్తుంది అని ఏమో....? 


మరింత సమాచారం తెలుసుకోండి: