జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కి మద్దతు తెలిపి చంద్రబాబు ముఖ్యమంత్రి అవటానికి కీలక పాత్ర పోషించారు.తర్వాత 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి ఎన్నికలలో పోటీ చేసి రెండు చోట్ల దారుణంగా ఓటమి పాలయ్యారు పవన్ కళ్యాణ్. భీమవరం మరియు గాజువాక నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ తర్వాత ఇక సినిమాల్లోకి వెళ్లిపోతారని రాజకీయాల్లో ఉండరు అని కామెంట్లు వచ్చిన క్రమంలో వెంటనే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి తాను సినిమాల్లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించడం జరిగింది.


తన చివరి రక్తపు బొట్టు వరకు మరియు తన కట్టె కాలే వరకు ప్రజా సమస్యలపై పోరాడతామని చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తానని అధికారికంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలు చేయాలని అభిమానులు, కొందరు సన్నిహితుల కోరిక మేరకు పవన్ మళ్ళీ సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడని సమాచారం. ఇందుమూలంగానే ఇటీవల విశాఖపట్టణం లో జరిగిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ బాగా పరిపాలించే తాను సినిమాల్లోకి వెళ్ళిపోతాను అని ప్రకటించడం జరిగిందని అయితే ఆల్రెడీ సినిమాలు కూడా పవన్ చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.


ఇటువంటి తరుణంలో బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ చేయడానికి పవన్ రెడీ అయినట్లు పవన్ సినిమా చేస్తున్నట్లు పింక్ రీమేక్ సినిమాని తామే నిర్మిస్తున్నట్లు...టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరియు బోనికపూర్ పవన్ కళ్యాణ్ ప్రకటించకుండానే ప్రకటించడం జరిగింది. దీంతో సినిమా మొదలు పెట్టద్దు అని భావించిన పవన్ కళ్యాణ్ ఆ ఇద్దరు నిర్మాతగా వ్యవహరించిన తీరుకు సీరియస్ అయ్యి తిరిగి సినిమా చేయడానికి ఆలోచిస్తున్నట్లు ఫిలిం నగర్ లో వినపడుతున్న టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: