తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాలో ఆర్ఆర్ఆర్ ఒకటి. బాహుబలి దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు కలిస్తే ఎలా ఉంటుందో అనే ఉహాత్మిక కథతో ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 30న విడుదలవ్వనున్నది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసే సన్నివేశాలు వెంట్రుకలను నిక్క పొడిచే విధంగా ఉంటాయంటూ హైప్ పెంచారు రాజమౌళి. 


ఇక అసలు విషయానికి వస్తే.. ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ పూర్తయ్యేవరకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను మీడియాకు , సినిమా ఫంక్షన్స్ కు దూరంగా ఉండాలంటూ వారికి ఒక నిబంధన పెట్టాడు రాజమౌళి. అయితే ఈ నిబంధనను జూనియర్ ఎన్టీఆర్ తూచా తప్పకుండ పాటిస్తున్నారు. కానీ చెర్రీ మాత్రం అనేకమార్లు మీడియా సమావేశాలలో కనిపిస్తూ ఈ నిబంధనని ఇష్టారాజ్యంగా ఉల్లంగిస్తున్నాడు. దీంతో జక్కన్న కి కొంచెం కోపం వచ్చింది. 


ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్ ఒప్పుకునే ముందు ఈ మల్టీ స్టారర్లు లకు పెట్టిన ఆ నిబంధనని రామ్ చరణ్ కి గుర్తు చేస్తూ పరోక్ష వార్నింగ్ ఇచ్చాడు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్ నిబంధన ప్రకారం మీడియా కంటపడట్లేదని కానీ రామ్ చరణ్ ఏదో ఒక వొంకతో తరచుగా మీడియా సమాశాలలో కనిపిస్తూ కండిషన్ ని బ్రేక్ చేస్తుండడంతో.. ఈ విషయాన్ని రాజమౌళి చిన్నగా చరణ్ దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం. సైరా విషయంలో రామ్ చరణ్.. రాజమౌళి నుంచి పర్మిషన్స్ తీసుకొని మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ మీడియాలో కనపడి...వార్తలలో నిలుస్తుండంతో ఇక లాభం లేదని రాజమౌళి చరణ్ కి వార్నింగ్ ఇచ్చాడంట.


మరింత సమాచారం తెలుసుకోండి: