తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాలో
ఆర్ఆర్ఆర్ ఒకటి.
బాహుబలి దర్శకుడు
రాజమౌళి దర్శకత్వంలో
రామ్ చరణ్, జూనియర్
ఎన్టీఆర్ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ
సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చారిత్రక యోధులైన
అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్లు కలిస్తే ఎలా ఉంటుందో అనే ఉహాత్మిక కథతో ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ
సినిమా వచ్చే ఏడాది
జూన్ 30న విడుదలవ్వనున్నది. ఈ సినిమాలో
ఎన్టీఆర్ చేసే సన్నివేశాలు వెంట్రుకలను నిక్క పొడిచే విధంగా ఉంటాయంటూ హైప్ పెంచారు రాజమౌళి.
ఇక అసలు విషయానికి వస్తే..
ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ పూర్తయ్యేవరకు
రామ్ చరణ్, జూనియర్
ఎన్టీఆర్ లను మీడియాకు ,
సినిమా ఫంక్షన్స్ కు దూరంగా ఉండాలంటూ వారికి ఒక నిబంధన పెట్టాడు రాజమౌళి. అయితే ఈ నిబంధనను జూనియర్
ఎన్టీఆర్ తూచా తప్పకుండ పాటిస్తున్నారు. కానీ
చెర్రీ మాత్రం అనేకమార్లు
మీడియా సమావేశాలలో కనిపిస్తూ ఈ నిబంధనని ఇష్టారాజ్యంగా ఉల్లంగిస్తున్నాడు. దీంతో
జక్కన్న కి కొంచెం కోపం వచ్చింది.
ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్ ఒప్పుకునే ముందు ఈ మల్టీ స్టారర్లు లకు పెట్టిన ఆ నిబంధనని
రామ్ చరణ్ కి గుర్తు చేస్తూ పరోక్ష వార్నింగ్ ఇచ్చాడు రాజమౌళి. జూనియర్
ఎన్టీఆర్ నిబంధన ప్రకారం
మీడియా కంటపడట్లేదని కానీ
రామ్ చరణ్ ఏదో ఒక వొంకతో తరచుగా
మీడియా సమాశాలలో కనిపిస్తూ కండిషన్ ని బ్రేక్ చేస్తుండడంతో.. ఈ విషయాన్ని
రాజమౌళి చిన్నగా
చరణ్ దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం.
సైరా విషయంలో
రామ్ చరణ్..
రాజమౌళి నుంచి పర్మిషన్స్ తీసుకొని మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ మీడియాలో కనపడి...వార్తలలో నిలుస్తుండంతో ఇక లాభం లేదని
రాజమౌళి చరణ్ కి వార్నింగ్ ఇచ్చాడంట.