పవన్ ‘పింక్’ రీమేక్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని వస్తున్న వార్తలకు చెక్ పెట్టే ఆలోచనలలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ‘పింక్’ రీమేక్ లో నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చిన తరువాత పవన్ ను పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా పోలుస్తూ అనేకమంది సెటైర్లు వేయడం అదేవిధంగా ఈ మధ్య కాలంలో పవన్ మూడు పెళ్ళిళ్ళ ప్రస్తావన రాజకీయ వర్గాలలో విపరీతంగా పెరిగి పోవడంతో జరుగుతున్న విషయాలు పవన్ కళ్యాణ్ ను బాధించడమే కాకుండా అతడి ఆలోచనలలో తీవ్ర మార్పులు తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి పవన్ ‘పింక్’ రీమేక్ లో నటిస్తాడు అని వార్తలు వచ్చిన దగ్గర నుండి ఆ సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడ పూర్తిగా నచ్చదు అన్న సంకేతాలు వచ్చాయి. దీనితో విమర్శలు ఎదుర్కుంటూ ‘పింక్’ రీమేక్ చేసినా ఆ మూవీ అనుకున్న విధంగా హిట్ అవ్వకపోతే రాజకీయాలలో మరింత చులకన అయిపోతాను అన్న భావన పవన్ కు వచ్చింది అని అంటున్నారు.

దీనికితోడు గత కొద్ది రోజులుగా పవన్ తన వేగాన్ని పెంచి జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీడియాకు హాట్ టాపిక్ గా మారుతున్నాడు. దీనికితోడు పవన్ చేస్తున్న కామెంట్స్ ఉపన్యాసాలను అనేక చానల్స్ చాల ప్రముఖంగా చూపెడుతున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో మళ్ళీ సినిమాల బాట పడితే పవన్ కు ఏ విషయం పైనా స్థిరత్వం లేదు అంటూ విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తాయని పవన్ కళ్యాణ్ భయపడుతున్నట్లు టాక్. దీనితో నటించే ‘పింక్’ రీమేక్ ఫలితం గ్యారెంటీ లేని పరిస్థుతులలో రాజకీయాలలోనే కాకుండా సినిమాలలో కూడ పవన్ హవా అయిపోయింది అని కామెంట్ చేయించుకోవడం ఇష్టం లేక తన సినిమా రీ ఎంట్రీ ఆలోచనలను ఒక ఆరు నెలలు వాయిదా వేస్తే మంచిది అన్న ఉద్దేశ్యంలో పవన్ ఉన్నట్లుగా తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: