సమంత అక్కినేనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెకు పెళ్లైనా కూడా ఇప్పటికీ స్టార్ హీరోలు కూడా ఈమెతో నటించడానికి సై అంటున్నారు.  .సమంత స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంత బిజీగా ఉన్నా మరో పక్క సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ తన సేవాగుణాన్ని చాటుకుంటోంది. 


“భగవంతుడు అన్నింటినీ నా స్థాయికి మించి ఇచ్చాడు. ఆ కృతజ్ఞతతోనే పేదలకు సాయం చేస్తున్నా”… అని అంటోంది సమంత దీనిపై సమంత మాట్లాడుతూ… “నేను నటిగా మంచి పేరు సంపాదించు కున్నాను. సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఈ రెండింటినీ ఏక కాలంలో ఎలా చేయగలుగుతున్నారు? శ్రమ అనిపించడం లేదా? అని పలువురు అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే పని లేకుంటేనే నాకు ఏమీ తోయదు” అని చెప్పింది.
 
“నాకంటే అందగత్తెలు చాలా మంది ఉన్నారు. నాకంటే ప్రతిభావంతురాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లందరిని కాదని భగవంతుడు నాకు టాప్ హీరోయిన్ స్టేటస్‌ను ఇచ్చాడు. నటనను నేను ప్రాణంగా భావిస్తున్నాను. సినిమానే నా జీవితంగా మారిపోయింది. ప్రతిభ, పేరు, డబ్బు, హోదా అన్నింటినీ భగవంతుడు నా స్థాయికి మించి ఇచ్చాడు. ఆ కృతజ్ఞత‌తోనే పేదలకు సాయం చేస్తున్నాను. నాకు సినీ అవకాశాలు తగ్గి..చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకునే పరిస్థితి వస్తే నా జీవితాన్ని పూర్తిగా సమాజసేవకు అంకితమిస్తా”అని అన్నారు.


శర్వానంద్, సమంత జంటగా దిల్‌రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 96 ఆధారంగా ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదలచేయబోతున్నారు . విజయ్ సేతుపతి, త్రిష జంటగా తమిళంలో రూపొందిన 96 చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్ తెలుగు రీమేక్‌కు  బాధ్యతల్ని చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: