రామ్ చరణ్ తన గుర్రాలను చాల వేగంగా పరుగులు తీయించడమే కాదు అతడు చాల వేగంగా కార్లను కూడ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఈ పరిస్థితులలో చరణ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ఫిలిం షూటింగ్ కు వెళుతూ తాను డ్రైవ్ చేస్తున్న కారులో ఒక సెల్ఫీ వీడియోను తీసి తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా తన అభిమానులకు షేర్ చేసాడు.

ఈ వీడియోలో చరణ్ స్వయంగా డ్రైవ్ చేస్తూ మాట్లాడటమే కాకుండా ఇలా ఉదయం పూట డ్రైవ్ చేసుకుంటూ షూటింగ్ స్పాట్ కు వెళ్ళడం తనకు బాగా ఇష్టం అంటూ తన అభిరుచిని తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు చరణ్ పోస్ట్ చేసిన వీడియోకి మంచి స్పందన వస్తున్నప్పటికీ వేగంగా డ్రైవ్ చేస్తున్న కారులో డ్రైవింగ్ సీటులో కూర్చుని సెల్ఫీ వీడియో షూట్ చేయడం మంచిది కాదనీ జాగ్రత్తగా ఉండాలని అభిమానులు చరణ్ కు సూచిస్తున్నారు. 

రామ్ చరణ్ కు ఉన్న అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ కారును కంట్రోల్ చేయడం చాల కష్టం. కేవలం కొద్ది సేకన్స్ లో ఈ కారు విపరీతమైన స్పీడ్ ను అందుకుంటుంది. ఈమధ్య కాలంలో అనేక రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతున్న నేపధ్యంలో తన అభిమానులకు రోల్ మోడల్ గా ఉండవలసిన చరణ్ ఇలా తన మొబైల్ కెమేరాతో డ్రైవింగ్ సీట్లో కూర్చుని సెల్ఫీ వీడియోలు వాటిని తన అభిమానులు షేర్ చేయడం ఏమిటి అని కొందరు చరణ్ తీరు పై విమర్శలు చేస్తున్నారు.

ఇప్పుడు ఈ విమర్శలు మెగా అభిమానుల దృష్టి వరకు రావడంతో ఇలాంటి సాహసాలు చేయవద్దని మెగా అభిమానులు వినయంగా తమ అభిమాన హీరోకి అభ్యర్ధనలు చేస్తున్నారు. అతివేగంతో డ్రైవింగ్ లో ఉంటూ సెల్ఫీ వీడియాలు తీసుకోవడం ప్రమాదకరం అంటూ ప్రచారాలు చేసే సెలెబ్రెటీలు ఇలాంటి విషయాలలో కొంచం జాగ్రత్త వహిస్తే మంచిది అన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: