జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతం ఓ పక్క బుల్లితెర మీద తన యాంకరింగ్ తో అలరిస్తూనే సిల్వర్ స్క్రీన్ పై తన అందాలతో ఆడియెన్స్ కు నిద్రపట్టకుండా చేస్తుంది. గుంటూర్ టాకీస్ తో వచ్చిన హాట్ ఇమేజ్ కొనసాగిస్తున్న రష్మి గౌతం అదే తరహా సినిమాల్లో చేస్తూ కెరియర్ వెళ్లదీస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత బాగా ఫాలో అవుతున్న రష్మి సినిమాలు, టివి షోలే కాకుండా కొత్తగా వెబ్ సీరీస్ లు కూడా చేసేందుకు సై అంటుంది.


శేఖర్ సూరి డైరక్షన్ లో త్వరలో ఓ వెబ్ సీరీస్ మొదలవబోతుంది. ఈ వెబ్ సీరీస్ లో రష్మి లెస్బియన్ గా నటిస్తుందట. సినిమాల్లో ఇప్పటికే తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న రష్మి కొత్తగా లెస్బియన్ గా కనిపించడం ఆమె ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చేలా ఉన్నా రెమ్యునరేషన్ గట్టిగా ఇస్తే ఎలాంటి రోల్ అయినా చేస్తా అని ఇదివరకు చెప్పిన విషయం గుర్తొస్తే ఈ రోల్ కు అమ్మడు బాగా ఛార్జ్ చేస్తుందని అనుకుంటున్నారు.


రష్మి చేసే ఈ లెస్బియన్ వెబ్ సీరీస్ కచ్చితంగా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ హాట్ ఇమేజ్ సంపాదించిన రష్మి లెస్బియన్ గా చేస్తే మాత్రం ఇక ఆ హంగామా వేరేలా ఉంటుంది. కేవలం డబ్బు కోసమే కాకున్నా ఆర్టిస్ట్ అంటే అన్ని అనుభవాలు ఉండాల్సిందే. అందుకే ఈ రోల్ ఛాలెజింగ్ గా చేస్తా అంటుంది రష్మి.


అయితే లెస్బియన్ అంటే మరో భామ కూడా ఉండాలి ఇంతకీ రష్మితో రొమాన్స్ చేసే మరో అమ్మాయి ఎవరు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓ పక్క బుల్లితెర మీద సుడిగాలి సుధీర్ రష్మి ప్రేమ కోసం కిందా మీద పడుతుంటే రష్మి ఇలా లెస్బియన్ గా మారి షాక్ ఇస్తుంది. ఈ వెబ్ సీరీస్ హిట్ అయితే మాత్రం అక్కడ కూడా రష్మి బిజీగా మారే అవకాశం కనిపిస్తుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: